వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు మ‌రో రిలీఫ్‌: ఒక్కొక్క‌టిగా వీడుతున్న అభియోగాలు: జ‌గ‌తి ఆస్తుల్లో తాజా ఉత్త‌ర్వులు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన గ‌తంలో న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల్లో జ‌గ‌తి అటాచ్‌మెంట్‌కు సంబంధించి ఈడీ తాజాగా కీలక ఉత్త‌ర్వులు ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్‌ ఎఫ్‌డీఆర్‌ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఉత్తర్వులను పాక్షి కంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. జగతి పబ్లికేష న్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీల తీరును మనీ లాండరింగ్‌ అప్పిలేట్‌ ట్రి బ్యునల్‌ తప్పుపట్టింది. ఈ మేర‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లొ విచార‌ణ స‌మ‌యంలో అధికారుల‌కు ఒక్కొక్క‌రుగా విముక్తుల‌వుతున్నారు. ఇక‌, ప్ర‌ధానంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ నిర్ణ‌యాల పైన తాజాగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జగతి ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి

జ‌గ‌న్‌కు సంబంధించిన ఆస్తుల ఎటాచ్‌మెంట్‌లో అప్పిలేట్‌ ట్రిబ్యునల్ కీల‌క ఆదేశాలు ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ.. అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీల తీరును మనీ లాండరింగ్‌ అప్పిలేట్‌ ట్రిబ్యున ల్‌ తప్పుపట్టింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా.. అందుబా టులో ఉన్న ఆధారాలను పట్టించుకోలేద‌ని ఆక్షేపించింది. . రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం తీర్పు వెలువ రించారు. ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్‌ జోన్‌ను కొనసాగించాలని అప్పి లెట్‌ ట్రిబ్యునల్‌ రాంకీ ఫార్మాస్యూటికల్‌ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుం దని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది.

Appellate Tribunal ordered to release 10 crores of attachments belongs to Jagati and Ramky group

ఈడీనే ఆరోప‌ణ‌లు నిరూపించాలి..
ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదన్నారు. అభియోగాలను నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉంటుందన్నారు. ఈ కేసులో రాంకీ గ్రూపు 'కళంకిత డబ్బు'తో భూములు కొన్నట్లు ఈడీ ఆధారాలు చూపలేదని తెలిపా రు. రాంకీతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని కొన్ని కీలక క్లాజులను ఈడీ, అడ్జ్యుడికేటింగ్‌ అథా రిటీ విస్మరించాయని కామెంట్ చేసారు. ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్‌ జోన్‌ను కొనసాగించాలని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ రాంకీ ఫార్మాస్యూటికల్‌ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయం లో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. అ లాగే 16 ప్లాట్లను వెంటనే రాంకీ సంస్థకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం చేసింది.

English summary
Appellate Tribunal ordered to release 10 crores of attachments belongs to Jagati and Ramky group. In jagan cases ED attached these properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X