వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ కేసుల్లో మ‌రో రిలీఫ్: ఈడీ కి ట్ర‌బ్యున‌ల్ అక్షింత‌లు: కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా..!

|
Google Oneindia TeluguNews

జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెన్నా..ప‌య‌నీర్ ఇన్‌ఫ్రా హోల్డింగ్ కంపెనీల పెట్టుబ‌డుల పైన మ‌నీలాండ‌రింగ్ అప్పిలేట్ ట్రిబ్యు న‌ల్ కీల‌క తీర్పు ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ వారు పెట్టిన పెట్టుబ‌డుల‌ను క్విడ్ ప్రోగా ప‌రిగ‌ణించ‌టాన్ని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తప్పుబట్టింది. ఆ ర‌కంగా నిరూపించేందుకు నిర్దిష్ట‌మైన ఆధారాలు ఏమీలేవని తేల్చిచెప్పింది. పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీల ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జుడికేటింగ్‌ అథారిటీల తీరు సరికాదని తేల్చింది. క్విడ్‌ ప్రో కో కింద లబ్ధి చేకూర్చినందుకు జగతి పబ్లికేషన్స్, కార్మిల్‌ ఏసియాలో రూ.53 కోట్లు పెట్టుబడులు పెట్టార‌నేది ప్ర‌ధాన అభియోగం. ఇప్పుడు ట్రిబ్యున‌ల్ తీర్పుతో ఇందులో మిన‌హాయింపు ల‌భించింది.

Recommended Video

8 న సంచలన ప్రకటన చేయనున్న సీఎం జగన్
ట్రిబ్యున‌ల్ తాజా తీర్పుతో..

ట్రిబ్యున‌ల్ తాజా తీర్పుతో..

క్విడ్‌ ప్రో కో కింద లబ్ధి చేకూర్చినందుకు జగతి పబ్లికేషన్స్, కార్మిల్‌ ఏసియాలో రూ.53 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఆరోపిస్తూ.. ఈడీ తమ ఆస్తులను జప్తుచేయడాన్ని సమర్థిస్తూ అడ్జుడికేటింగ్‌ అథారిటీ 2015లో జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్, పయనీర్‌ ఇన్‌ఫ్రాలు అప్పిలెట్‌ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన అప్పిలెట్‌ అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ మన్మోహన్‌సింగ్ తీర్పు చెప్పారు. అభియోగాలు నిరూపించేందుకు అవ‌స‌ర‌మైన స్థాయిలో విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవని తేల్చిచెప్పింది. పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీల ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జుడికేటింగ్‌ అథారిటీల తీరు సరికాదంది. పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రాలు మనీలాండరింగ్‌ కింద ‘షెడ్యూల్డ్‌ నేరం' చేశాయని అడ్జుడికేటింగ్‌ అథారిటీ చెప్పడాన్ని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తన తీర్పులో ఆక్షేపించింది. అలాగే, జప్తుచేసిన ఆస్తులు నేరానికి సంబంధించినవేనని కూడా నిర్ధారించడాన్ని సైతం ట్రిబ్యున‌ల్ త‌ప్పు బ‌ట్టింది.

జ‌గ‌న్ కంపెనీల్లో వాటా విలువ పెరిగింది..

జ‌గ‌న్ కంపెనీల్లో వాటా విలువ పెరిగింది..

ఇదే సంస్థ‌లు అదే రీతిలో జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు జారీచేసిన వాటాలకు ఎటువంటి విలువ లేదన్న ఈడీ వాదనను అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. బహిరంగ మార్కెట్‌లో ఈ వాటాల విలువ పెరిగిందన్న విషయాన్ని గుర్తుచేసింది. పెన్నా సిమెంట్స్‌కు భూముల బదలాయింపులో చట్ట నిబంధనలను అనుసరించలేదన్న ఈడీ వాదనను సైతం ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. ఈ వాదన ఎంతమాత్రం సరికాదని తేల్చింది. చట్ట నిబంధనలకు లోబడే భూముల బదలాయింపు జ‌రిగింద‌ని నిర్ధారించిది. ఆస్తుల జప్తు ఖరారు ఉత్తర్వులను జారీచేసే ముందు ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. పెన్సా సిమెంట్స్‌ ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన నేపథ్యంలో అనంతపురం జిల్లా, యాడకి మండలంలో జప్తు చేసిన 231 ఎకరాల భూమిని జప్తు నుంచి విడు దల చేయడంలేదంది. అయితే, ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకోరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఆదేశిం చింది.

ఇడి నిర్వాకాన్ని బ‌య‌ట‌పెట్టిన ట్రిబ్యున‌ల్

ఇడి నిర్వాకాన్ని బ‌య‌ట‌పెట్టిన ట్రిబ్యున‌ల్

ఏ సంస్థ అయినా రూ.1.5 కోట్ల లాభం కోసం ఎవరైనా రూ.53 కోట్లు పెట్టుబడి పెడతారా! ఎలా సాధ్యమో కూడా అర్థం కాకుండా ఉంది. ఇలా పెట్టుబడి పెట్టడాన్ని లంచం అనడం ఊహకు అందనిదిగా ఉంద‌ని ట్రిబ్యున‌ల్ వ్యాఖ్యానిం చింది.బ‌ల‌వంతంగా భూములు తీసుకున్నార‌ని ఏ ఒక్క రైతు అయినా ఫిర్యాదు చేసారా అని ప్ర‌శ్నించింది. కేవ‌లం ఆరోప‌ణ‌ల ఆధారంగా ఆస్తుల‌ను ఎటాచ్ చేయ‌వ‌ద్ద‌ని ట్రిబ్యున‌ల్ స్ప‌ష్టం చేసింది. ఇడి స్వ‌తంత్రండా ఆధారాలు సేక రించాల‌ని ట్రిబ్యునల్ సూచించింది. బంజారాహిల్స్‌లో నిర్మించిన హోటల్‌ భవనానికి సంబంధించి అడ్జుడికేటింగ్‌ అథారిటీ జారీచేసిన జప్తు ఖరారు ఉత్తర్వులను సవరించింది. ఆ భవనాన్ని జప్తు నుంచి విడుదల చేస్తూ, ఆ భవనం తాలుకు విలువను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కింద వసూలు చేసుకోవాలని ఈడీకి స్పష్టంచేసింది.ఇక‌, మిగిలిన కేసుల్లోనూ నాడు ఇడీ..సీబీఐ ఆరోప‌ణ‌ల ఆధారంగా ప‌ని చేసార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైనంని..దీని ద్వారా జ‌గ‌న్ పైన అవ‌న్నీ ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన అభియోగాలుగానే మిగిలిపోతాయ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

English summary
Appellate tribunal says that Penna Cements investments in jagan group is not money laundering. It seem to be by allegations only assets attached.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X