• search
 • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీకి మరో బంపర్ ప్రాజెక్టు - కడపలో ఆపిల్ తయారీ యూనిట్ - మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి

|

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) లేదా సరళీకృత వాణిజ్యంలో దేశంలోనే టాప్ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు మరో బంపర్ ప్రాజెక్టు రానుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటుకానున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా 50 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణ

 చైనా స్థాయిలోనే ఏపీలో..

చైనా స్థాయిలోనే ఏపీలో..

ఆపిల్ సంస్థకు చైనాలో ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయని, అక్కడి ఒక్కో ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని, అదే తరహాలో కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. దాదాపు ఖరారుకావొచ్చిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇతర వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

సౌకర్యాలు కల్పించాకే భూకేటాయింపు..

సౌకర్యాలు కల్పించాకే భూకేటాయింపు..

అదేసమయంలో, లక్షల మందికి ఉపాధి కల్పించే ఔషధ పార్కు ఏర్పాటుకు కూడా జగన్ సర్కారు ప్రాధాన్యం ఇస్తుందని, ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలు స్థాపించాలనుకుంటోన్న కంపెనీలకు ఊరికే భూమి కేటాయించడం కాకుండా.. విద్యుత్, నీరు, డ్రైనేజ్, రవాణా సౌకర్యం లాంటివి కల్పించిన తర్వాతే భూముల్ని కేటాయించే విధానాన్ని అవలంభిస్తున్నామని, అందుకే మెజార్టీ కంపెనీలు ఏపీ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని గౌతమ్ రెడ్డి అన్నారు.

చంద్రబాబులా ఫేక్ ఎంవోయూలకు నో

చంద్రబాబులా ఫేక్ ఎంవోయూలకు నో

గత చంద్రబాబు హయాంలో చేసినట్లుగా ప్రచారం కోసం ఫేక్ ఎంవోయూలు కుదుర్చుకునే విధానాలను జగన్ సర్కారు అవలంభించబోదని, ఆయా సంస్థలతో పక్కాగా చర్చలు, ఒప్పందాలు కుదిరిదిన తర్వాతే ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో దాదాపు రూ.50వేల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేయగా, అందులో కేవలం రూ.32కోట్ల విలువైన ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపందాల్చాయిని, టీడీపీ పాలనలో ఏపీకి వచ్చిన ఒకే ఒక్క మెగా ప్రాజెక్టు ‘కియా' కార్ల తయారీ యూనిట్ కాగా, దానికి కూడా, రాష్ట్రంపై పెను భారం పడేలా తలకుమించిన తయిలాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందనుకున్న పెట్టుబడులకు మాత్రమే అంగీకారం తెలుపుతున్నామని, అది కూడా నిర్ణీత కాలపరిమితిలో ఏర్పాటయ్యేలా విధానాలను రూపొందించామని గౌతమ్ రెడ్డి వివరించారు.

  Reliance Industries Ranked 2nd Biggest Brand Globally After Apple || Oneindia Telugu

  షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్‌లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్

  English summary
  Apple Inc. likely to invest at Kopparthi in Kadapa district and generate at least 50,000 employment. Discussions are in progress with the company, informed the Minister for Industries Mekapati Goutham Reddy. the worth of the investment of the project would be decided in the coming days, says minister.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X