వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిలో మూడు యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్‌ విసిల నియామకం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో మూడు యూనివర్సీటీలకు ఎపి ప్రభుత్వం ఇన్‌ఛార్జ్‌ వైస్‌ చాన్సలర్‌లను నియమించింది. సోమవారంతో ఎపిలోని మూడు విశ్వవిద్యాలయాల విసిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త ఇన్ ఛార్జ్ ఉప కులపతులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Appointment of Incharge VCs for three Universities in AP

జెఎన్‌టియు కాకినాడ విసి విఎస్‌ఎస్‌ కుమార్‌, నెల్లూరులోని విక్రమ్‌ సింహపూరి యూనివర్సిటీ విసిగా ఉన్న వై.వీరయ్య, కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ విసి వై నరసింహులు పదవీకాలం సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. జెఎన్‌టియు కాకినాడ ఇన్‌చార్జ్‌ విసిగా కృష్ణా యూనివర్సిటీ విసి ఎస్‌ రామకృష్ణ రావును, సింహపురి ఇన్‌చార్జ్‌ విసిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విసి ఎ రాజేంద్రప్రసాద్‌ను, రాయలసీమ వర్సిటీ ఇన్‌చార్జ్‌ విసిగా యోగి వేమన యూనివర్సిటీ విసి ఎ రామచంద్రారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Three universities in Andhra Pradesh got new incharge Vice-Chancellors after AP Government issue appointment orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X