ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్: పరీక్షల తేదీల ప్రకటన
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సిద్ధమైంది. కరోనావైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. సోమవారం పరీక్ష తేదీలతోపాటు ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 15 నుంచి ఉద్యోగ నిమామక పరీక్షలు ప్రారంభించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.

పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి..
సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు
సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు
సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్ష
సెప్టెంబర్ 23న పోలీస్ విభాగంలో టెక్నిల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబర్ 23,24న పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.