APPSC APRO Result 2019: ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అసిస్టెంట్ పీఆర్వో ఫలితాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌కు నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో 23 అక్టోబర్ 2019న హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు జరుగు చోటు:
ఏపీపీఎస్సీ,
న్యూ హెచ్ఓడీ బిల్డిండ్, 2వ అంతస్తు,
ఎంజీ రోడ్డు, ఇందిరాగాంధీ మునిసిపల్ కాంప్లెక్స్ ఎదురుగా,
విజయవాడ.

ఇక ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అంటే ఏ అభ్యర్థికి ఏ సమయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారనే తదితర అంశాలను కమిషన్ వెబ్సైట్లో త్వరలో పెడుతుంది. అంతేకాదు ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లను కూడా కమిషన్ పంపిస్తుంది. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్లను తీసుకు రావాల్సి ఉంటుంది.
* వయస్సు ధృవీకరణ పత్రం
* విద్యార్హత సర్టిఫికేట్లు
* స్టడీ సర్టిఫికేట్
* క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్
* క్రిమీలేయర్ సర్టిఫికేట్లు
* అభ్యర్థి దివ్యాంగుడైతే పీహెచ్ సర్టిఫికేట్
ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఏదైతే సమాచారం పొందుపరిచారో వాటితో సరిపోలి ఉండాలి. ఒక వేళ తప్పుడు సర్టిఫికేట్లు సమర్పిస్తే అభ్యర్థిత్వాన్ని కమిషన్ రద్దు చేస్తుంది. తప్పుడు సర్టిఫికేట్లు తీసుకొస్తే అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసేందుకు ఏపీపీఎస్సీకి అన్ని హక్కులు ఉన్నాయని వెల్లడించింది.
ఇక అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌కు సంబంధించి ఆన్లైన్ పరీక్ష 29 ఏప్రిల్ 2019 మరియు 30 ఏప్రిల్ 2019న జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు కేంద్రాల్లో ఈ ఆన్లైన్ పరీక్షను నిర్వహించారు.