వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APSRTC : ఆర్టీసీ పండగ సీజన్ ఆఫర్- టికెట్ల ముందస్తు రిజర్వేషన్లపై గుడ్ న్యూస్

|
Google Oneindia TeluguNews

దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పొడిగిసిస్తున్నట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ఉన్న ముందస్తు రిజర్వేషన్‌ గడువును రేపటి నుంచి 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పండుగల సీజన్లో అదనపు ఛార్జీల్ని ఆర్టీసీ వడ్డిస్తోంది. ప్రస్తుతం 60 రోజుల ముందస్తు బుకింగ్ అమల్లోకి వస్తుండటంతో వచ్చే సంక్రాంతికి దూర ప్రాంతాలకు ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి వీటి బెడద తప్పనుంది. అదే చివరి నిమిషంలో టికెట్ల కోసం ప్రయత్నిస్తే అప్పుడు స్పెషల్ సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీ వడ్డన తప్పకపోవచ్చు.

ఏపీఎస్ఆర్టీసీ పండుగ సీజన్లో ప్రయాణికులకు మరో ఆఫర్ ఇచ్చింది. ముఖ్యంగా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ చేసుకునే వారికి ఇది ప్రయోజనం కల్పించనుంది. పండుగ సీజన్లో టికెట్లు దొరుకుతాయో లేదో అని ఎదురుచూస్తున్న వారికి ఇది కచ్చితంగా శుభవార్త కానుంది. దీంతో ప్రయాణికులు ఇప్పటినుంచే టికెట్లకు ఎగబడే అవకాశముంది.

APSRTC advance ticket bookings time extended to 60 days now for festival season

ఏపీఎస్ ఆర్టీసీ పండుగ సీజన్లో దూర ప్రాంతాైలకు రిజర్వేషన్లు చేసుకోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును ఏకంగా రెట్టింపు చేసింది. అంటే 60 రోజుల ముందుగానే దూర ప్రాంతాలకు బస్ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చన్న మాట. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు పలు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్లను పండుగల సీజన్ కోసం ముందుగా బుక్ చేసుకునేందుకు వీలు కలిగింది. ఈ సారి సంక్రాంతి సీజన్లో భారీ ఎత్తున రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పొడిగిసిస్తున్నట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ఉన్న ముందస్తు రిజర్వేషన్‌ గడువును రేపటి నుంచి 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పండుగల సీజన్లో అదనపు ఛార్జీల్ని ఆర్టీసీ వడ్డిస్తోంది. ప్రస్తుతం 60 రోజుల ముందస్తు బుకింగ్ అమల్లోకి వస్తుండటంతో వచ్చే సంక్రాంతికి దూర ప్రాంతాలకు ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి వీటి బెడద తప్పనుంది. అదే చివరి నిమిషంలో టికెట్ల కోసం ప్రయత్నిస్తే అప్పుడు స్పెషల్ సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీ వడ్డన తప్పకపోవచ్చు.

Recommended Video

Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu

రెండేళ్లుగా సంక్రాంతి సీజన్లో కరోనా భయాలతో జనం ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోయింది. ఈ ఏడాది దసరా సీజన్లో కాస్త నష్టాల నుంచి కోలుకున్న ఆర్టీసీ.. సంక్రాంతి కల్లా కరోనా భయాలు మరింత తగ్గి ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే ఆర్టీసీ మెరుగైన లాభాలు ఆర్ఝించే అవకాశముంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆర్టీసీకి మరిన్ని సర్వీసులు పెంచుదామని ఈ మధ్యే ప్రతిపాదించింది. ఇది కూడా ఆమోదం పొందితే ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసి ఆదాయం పెరగనుంది.

English summary
apsrtc has extended duration of advance ticket bookings to 60 days in wake of festival season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X