వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎస్ఆర్టీసీకి అరుదైన ఘనత- అన్ లాక్ తర్వాత దేశంలోనే నంబర్ వన్- ఎందులో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను అన్ని రాష్ట్రాలు దాదాపుగా సడలిస్తున్నాయి. దీంతో ప్రజా రవాణా కూడా క్రమంగా సాధారణ స్ధితికి చేరుకుంటోంది. పలు రాష్ట్రాల నుంచి బస్సు సర్వీసులు కూడా ఇతర రాష్ట్రాలకు కొనసాగుతున్నాయి. ఇలా అన్ లాక్ 1.0 ప్రారంభమయ్యాక అంతర్ రాష్ట్ర సర్వీసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ఆ ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్: క్లారిటీ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డిఆ ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్: క్లారిటీ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి

అన్ లాక్ 1.0లో భాగంగా అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాక టికెట్ల బుకింగ్ లు కూడా పెరుగుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా నమోదవుతున్న అంతర్ రాష్ట్ర సర్వీసుల టికెట్ల బుకింగ్ లో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉన్నట్లు తాజాగా తేలింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదైన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏపీఎస్ఆర్టీసీ 70 టికెట్ల బుకింగ్ తో అగ్రస్ధానంలో ఉన్నట్లు స్పష్టమైందని ఆగ్రిగేటర్ సంస్ధ అభి బస్ తాజాగా వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనట్లు తెలిపింది.

apsrtc bags number one position in country in booking tickets after unlock 1.0

Recommended Video

Sushant Singh Rajput's Fan ఆత్మహత్య, సూసైడ్ నోట్ లో ఏం రాసాడో తెలుసా ?

ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ 6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. మరో 1,445 ప్రైవేట్‌ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి 596 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, వైజాగ్‌ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లీ-లక్నోల మధ్య నడుస్తున్నాయి.

English summary
andhra pradesh road transport corporation bags top position in highest tickets booking after unlock 1.0, as per aggregator abhi bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X