పెరగనున్న బస్సు ఛార్జీలు?: ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ, ‘టి’ కోసం వేచి చూసే దోరణి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసి ఛార్జీలు పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ఆర్టీసి యాజమాన్యం తాజాగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఉద్యోగులకు వేతనాల సవరణ చేయడం వల్ల ప్రతి నెల 50 కోట్ల రూపాయల భారం పడుతోంది.
అంతేగాక, గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన నష్టాల నుంచి తేరుకునేందుకు ఛార్జీల పెంపుదల అనివార్యమంటూ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం.
మొత్తం 15 శాతం వరకు ఛార్జీలను పెంచడం వల్ల రూ.650 కోట్ల వరకు సాలీనా ఆదాయం వస్తుందని అంచనా. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ ఛార్జీలను 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసి ప్రతిపాదనలు పంపింది.

కి.మీకు పల్లెవెలుగుకు 59 పైసల నుంచి 68 పైసలు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 79 పైసల నుంచి 91 పైసలు, డీలెక్స్ బస్సులకు 89 పైసల నుంచి 121 పైసలు, సూపర్ లగ్జరీకి 105 పైసల నుంచి 121 పైసలు, ఇంద్రకు 132 పైసల నుంచి 152 పైసలు, గరుఢకు 155పైసల నుంచి 178పైసలు, గరుడ ప్లస్‌కు 165 పైసల నుంచి 190పైసలుకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆర్టీసి ఛార్జీలు పెంచితే తాము చార్జీలు పెంచాలని ఏపి ప్రభుత్వం వేచి ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ ఆర్టీసి ఆంధ్ర ఆర్టీసి కంటే కొంత మేరకు లాభాలతో నడుస్తోంది. పైగా ప్రభుత్వం ఆర్టీసిని ఆదుకునే చర్యలను చేపట్టింది.
కాగా, ఈ తరహా చర్యలు ఆంధ్ర ఆర్టీసిలో లేవు. దీని వల్ల ఆర్టీసి చార్జీలను అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆర్టీసి కార్మిక సంఘం వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 22వ తేదీన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ఆర్టీసి యాజమాన్యం చార్జీలు పెంచేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications