వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక..బాదుడు మొద‌లు : ఏపీఎస్‌ఆర్టీసీ లో ఛార్జీల పెంపు ఖాయం : ప‌్ర‌భుత్వ నిర్ణ‌య‌మే పెండింగ్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. ఇక ప్ర‌జ‌ల మీద భారం మోపే నిర్ణ‌యాల‌కు రంగం సిద్దం అవుతోంది. తొలుత ఆర్టీసి ఛార్జీలు పెంచేందుకు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. ఛార్జీలు పెంచాల‌ని ఏపీఎస్‌ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపింది. 15 నుంచి 17 శాతం మేర ఛార్జీలు పెంచాలంటూ ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌భుత్వాన్ని కోరింది.

APSRTC Charges may hike shortly : RTC MD Submitted proposals to govt..

ఏపీఎస్‌ఆర్టీసీ లో ఛార్జీల పెంపు..
ఏపిలో ఛార్జీలు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపింది. 15 నుంచి 17 శాతం మేర ఛార్జీలు పెంచాలంటూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఎపిఎస్‌ ఆర్టీసికి చట్ట ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము ఇవ్వకపోవడం వల్లనే ఆ సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. బ2014 నాటికి ఆర్టీసికి ఏడాదికి రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చేదల్లా 2018కి సుమారు రూ.5,500 కోట్లకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో(ఒఆర్‌) కూడా 66 శాతం నుంచి 76.71 శాతానికి పెరిగింది. ఎన్ని విధాలుగా ఆర్టీసి అభివృద్ధి చెందినా అప్పులు, వడ్డీలతో కలిపి సుమారు రూ.6,250 కోట్ల నష్టాల్లో వుంది. ఆర్టీసికి వచ్చే ఆదాయంలో దాదాపు రూ.2,100 కోట్లు పన్నులకే చెల్లించాల్సి వస్తోంది. విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను ఉండగా ఆర్టీసికి డీజిల్‌పై 26.24 శాతం పన్ను విధిస్తున్నారు.

15 శాతం పెంచితే..
ఏపీయ‌స్ఆర్జీసీ ప్ర‌తిపాదించిన విధంగా రేట్లు పెంచితే దాదాపు 15 శాతం మేర ప్ర‌యాణీకుల పైన భారం ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్టీసి మాత్రం 15 నుండి 17 శాతం వ‌ర‌కు పెంపుద‌లకు అనుమ‌తించాల‌ని ప్ర‌భుత్వాన్ని అభ్య‌ర్దిస్తోంది. ఆర్టీసిలో పది లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు 3500, 15లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు 1500 ఉన్నాయి. వాటి స్థానాల్లో కొత్త బస్సులను తీసుకొ చ్చేందుకు కనీసం రూ.2వేల కోట్లు కావాలి. ప్రభుత్వం బస్సుల కొనుగోలుకు సాయమందించకపోవడంతో అద్దె బస్సుల కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇక‌, ఇప్పుడు బ‌స్సుల్లో ఏ కేట‌గిరీలో ఏ మేర పెంచుతార‌నేది తెలియాల్సి ఉంది. ప‌ల్లెవెలుగు బ‌స్సుల ప్ర‌యాణీకుల మీద త‌క్కువ భారం ప‌డేలా నిర్ణ‌యం ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఆర్టీసి యాజ‌మాన్యం ప్ర‌తిపాద‌న‌లు పంపినా కొత్త ప్ర‌భుత్వ కొలువు తీరాకే దీని పైన నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
Bus fares may be hike shortly in ap. APSRTC MD submitted proposals for Charges hike to govt due to cover loss in organisation. Govt have to take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X