వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు జరిగాయి. కాగా చర్చలు విఫలం కావడంతో కార్మీకులు సమ్మే బాట పట్టేందుకు సిద్దమయ్యారు.అయితే సమ్మే తేదీని రేపు ప్రకటించనున్నట్టు కార్మీక నాయకులు తెలిపారు.కాగా సమ్మేకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.

కార్మీక సంఘాల చర్చలు విఫలం

కార్మీక సంఘాల చర్చలు విఫలం

కాగా ఆర్టీసీ కార్మీకులకు చెల్లించాల్సిన బాకాయిలు వెంటనే చెల్లించాలని కార్మీక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక ఆర్టీసీ నష్టలకు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు కారణమని కార్మీక సంఘాలు మండిపడ్డాయి.కాగా గత అయిదు సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉద్యోగులు విరమణ పోందుతున్నా అందుకు అనుగుణంగా నియామాకాలు చేపట్టడం లేదని కార్మీక సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. జోనల్ రద్దుతోపాటు కోత్త రిక్రూట్‌మెంట్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతోపాటు ఉద్యోగుల జీతాలు కూడ పెంచాలని కార్మీక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈనేపథ్యంలోనే సమ్మె నోటీసు ఇచ్చి యాజమాన్యంతో చర్చలు జరిపాయి.

ఈనెల 8న సమ్మె నోటీసు ఇచ్చిన కార్మీక సంఘాలు

ఈనెల 8న సమ్మె నోటీసు ఇచ్చిన కార్మీక సంఘాలు


చర్చల్లో భాగంగానే ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చారు. దీంతో ఈయూతో సహ 10 కార్మీక సంఘాలు యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. దీంతో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. అయితే సమ్మె విరమించని పక్షంలో ఈనెల 22 తర్వాత ఏ క్షణమైన సమ్మెలోకి వెళ్తామని కార్మీక సంఘాలు తెలిపాయి. ఈనేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఈయూతోపాటు ఇతర సంఘాలను మంగళవారం చర్చలకు ఆహ్వనించారు. ఇందుకోసం మంగళవారం సుమారు అయిదు గంటలపాటు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.

నేడు సమ్మే తేదీని ప్రకటించనున్న కార్మీక సంఘాలు

నేడు సమ్మే తేదీని ప్రకటించనున్న కార్మీక సంఘాలు

కార్మీకులు మొత్తం 27 డిమాండ్లపై నోటీసును ఇచ్చారు. అందులో ప్రధానంగా జీతాల సవరణ బకాయిల నిధుల్ని విడుదల చేయడంతోపాటు, అద్దే బస్సుల పెంపు ఉపసంహరణ, సిబ్బందిని తగ్గించే చర్యలు విరమించుకోవడంతోపాటు ఉద్యోగాల భర్తిని కూడ వెంటనే చేపట్టాలని నోటీస్ లో పేర్కోన్నారు.అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సమస్యలను వెంటనే పరిష్కరించలేమని సంస్థ ఎండీ వారికి వివరించారు. ఈనేపథ్యంలోనే కార్మీక సంఘాలు ఎండీ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇప్పటికే బకాయిల చెల్లింపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో బుధవారం కార్మీక సంఘాలు సమావేశం కానున్నారు. అనంతరం సమ్మే తేదీని ప్రకటిస్తామని వారు తెలిపారు.

English summary
APSRTC Employees Call Off Strike Over Salary Hike,the rtc jac negotiations were failed with rtc officials,There were about five hours of discussions between the employees and officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X