వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఆర్సీ కోల్పోయాం-నష్టం భర్తీ చేయాల్సిందే-సీఎం జగన్ కు ఆర్టీసీ ఉద్యోగుల లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలో తమను ప్రభుత్వంలో కలపాలంటూ ఉద్యోగులు చేసిన డిమాండ్ ను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఆర్టీసికి చెందిన 53 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వంలో వీలీనం అయ్యారు. మరోవైపు ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చింది. దీన్ని తాము వారు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమకూ పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వంలో విలీనం కాకముందు ప్రారంభమైన పీఆర్సీని ఇప్పుడు అమలు చేయడం వల్ల తాము నష్టపోతున్నామని, దాన్ని భర్తీ చేయారంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఇవాళ సీఎం జగన్ కు లేఖ రాసింది. ప్రభుత్వంలో విలీనంతో 2021లో ఒక పీఆర్సీ కోల్పోయామని, విలీనం వల్ల కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీచేయాలిని ఈయూ ఈ లేఖలో కోరింది. 2017 పీఆర్సీకి 2019లో 25శాతం తాత్కాలిక ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, ప్రభుత్వోద్యోగులతో పాటే తమకూ ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నారని ఈయూ నేతలు సీఎం జగన్ కు గుర్తు చేశారు.

apsrtc employees union demand cm yagan to compensate prc loss due to merger into government

ప్రభుత్వంలో విలీనం వల్ల 2021 పీఆర్సీ పెండింగ్‌లో పడిందని వారు జగన్ దృష్టికి తెచ్చారు. తాజా పీఆర్సీ వల్ల 2021 పీఆర్సీని నష్టపోతున్నామని ఉద్యోగులు తెలిపారు. తమకూ అదనపు ఫిట్‌మెంట్‌ ప్రయోజనం ఇచ్చి స్కేల్స్ నిర్ణయించాలని ఈయూ కోరుతోంది. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలు తొలగిస్తున్నారని, ఇప్పటికే ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ, గ్రాట్యుటీ సౌకర్యం తొలగించారని ఈయూ నేతలు తెలిపారు. వైద్య సౌకర్యాలు, నెలసరి ఇన్సెంటివ్‌లు నిలిపేశారన్నారు. కాబట్టి పీఆర్సీ నష్టాన్ని కూడా భరించలేమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ ప్రయోజనం కల్పించాలని ఈయూ నేతలు సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.

English summary
apsrtc employees union on today demands ap cm ys jagan to compensate their prc loss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X