6500 కోట్ల బకాయిల్లో ఆర్టీసీ : 30 శాతం ధరలు పెంచాల్సిందే : ఎండీ సురేంద్రబాబు..!
ఏపీయస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వటంతో సంస్థ పరిస్థితి గురించి ఎండీ సురేంద్ర బాబు వివరించారు. సంస్థ ఆర్దికంగా ఎదుర్కొంటున్న కష్టాలను..నష్టాలను అంకెలతో సహా చెప్పుకొచ్చారు. కార్మికుల భవిష్య నిధి సొమ్ము సైతం వినియోగించామని..వారికి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. సంస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 శాత మేర ధరలు పెంచటం మినహా గత్యంతరం లేదన్నారు.
వందల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ..
ఏపీయస్ఆర్టీసీ వందల కోట్ల నష్టాల్లో ఉందని సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర బాబు చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ప్రధాన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. దీంతో..సంస్థ పరిస్థితిని వివరించేందుకు ఎండీ మీడియా ముందుకు వచ్చారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏడాదికి రూ.650 కోట్లు భరించాల్సి వస్తోందని సురేంద్రబాబు అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.735 కోట్లు నష్టం ఏర్పడిందని, 2016-17లో ఇది రూ.789 కోట్లకు చేరిందని తెలిపారు. 2017-18లో రూ1205 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని సురేంద్రబాబు వివరించారు. ఈ ఏడాది పీఆర్సీ, డీజిల్ ధరల ప్రభావం ఉన్నప్పటికీ నిబద్ధతతో పని చేసి నష్టాన్ని తగ్గించామని చెప్పుకొచ్చారు.

రూ.6500 కోట్ల బకాయిలు ఉన్నాయి..
ఆర్టీసీ నిర్వహణ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయని వివరించారు. ఇప్పటి వరకూ రుణాల రూపేణా ఆర్టీసీకి రూ.3,380 కోట్ల అప్పులున్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 20 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఉద్యోగుల భవిష్యనిధి పేరిట 671 కోట్లు జమచేయాల్సి ఉందని వెల్లడించారు. ఇతరత్రా బకాయిలన్నీ కలిపి ఆర్టీసీ రూ. 6500 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను రూపంలో రూ.316 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల వల్ల రూ.1409 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. కాలంచెల్లిన బస్సులు నడిపే పరిస్థితి ఇకపై ఉండదని, 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ మార్చాలంటే మొత్తం 1666 కొత్త బస్సులు అవసర