వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు సంక్రాంతి షాక్‌- స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం ఛార్జీ అదనం

|
Google Oneindia TeluguNews

కరోనా తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఈసారి సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల నుంచి భారీగా అదనపు ఛార్జీలు వసూలు చేయడం ద్వారా వాటిని పూడ్చుకోవాలని భావిస్తోంది. ఈసారి సంక్రాంతి కోసం వెయ్యికి పైగా అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ వాటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోతోంది.

ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు రూట్లు రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులు సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. వీటితో పాటు ఏపీలో కూడా వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. విజయవాడ నుంచి విశాఖ, తిరుపతి, ఇతర ప్రాంతాలకూ ఈ స్పెషల్ సర్వీసులు పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.

apsrtc shock to sankranti travellers, 50 percent extra charges in special buses

కరోనా వల్ల ఇప్పటి వరకు ఆర్టీసీ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయిందని, ఈ ఏడాది సగటు ఓఆర్‌ 59.14 శాతమే ఉందని ఎండీ కృష్ణబాబు తెలిపారు. డిసెంబరులో ఓఆర్‌ 70.74 శాతానికి పెరిగింది. మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుందన్నారు. సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.
5,586 మంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడగా.. 91 మంది చనిపోయారు.వీరికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఉద్యోగులు ప్రజారవాణాశాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్‌ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశామన్నారు.

English summary
andhra pradesh road transport corporation has decided to levy 50 percent extra charge to its travellers for sankranti special buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X