వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి కర్ణాటకకు సర్వీసులు.. ఆన్ లైన్ లో టికెట్స్..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ సడలింపులతో దాదాపు సాధారణ స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 253 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152కు పెరిగింది. మరణాల సంఖ్య 84కు చేరింది. గత వారం రోజులుగా కొత్త కేసుల ఉధృతి పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చజరిగింది. వాటిని పుకార్లుగా కొట్టిపారేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టుఅమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టు

 17 నుంచి కర్ణాటకకు..

17 నుంచి కర్ణాటకకు..

నాలుగో దశ లాక్ డౌన్ ముగిసే నాటికే ఏపీలో బస్సులు తిరుగుతున్నా.. అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం అదివారం ఒక ప్రకటన చేసింది.

దశలవారీగా పెంపు..

దశలవారీగా పెంపు..

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. తొలుత పరిమిత సంఖ్యలో మాత్రమే కర్ణాటకకు సర్వీసులు నడుపుతామని, దశలవారీగా వాటిని విస్తరిస్తామని అధికారులు తెలిపారు. తొలిదశలో 168 బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని, 4 దశల్లో వాటి సంఖ్యను 500కు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

 సోమవారం నుంచి టికెట్లు..

సోమవారం నుంచి టికెట్లు..

ఈనెల 17 నుంచి కర్ణాటకకు వెళ్లే బస్సుల్లో టికెట్లకు సంబంధించి సోమవారం(ఈనెల 15) నుంచే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు https://www.apsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించింది. కాగా, అన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుందని, ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Recommended Video

APSRTC In Tough Situation,Neighbour States Not Intrested To Allow AP Buses
 రెండు వైపులా టెస్టులు..

రెండు వైపులా టెస్టులు..

బుధవారం నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పున:ప్రారంభం కానుండటంతో ఏపీఎస్ఆర్టీసీ ఆమేరకు భారీ ఏర్పాట్లు చేసుకుంది. అన్ని సర్వీసులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ, క్రిమిసంహారక మందులను స్ప్రే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఇటు నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల్ని, తిరుగు ప్రయాణంలో కర్ణాటక నుంచి వచ్చేవాళ్లకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి..తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి..

English summary
apsrtc announced on sunday that the bus services to karnataka will be resumed from june 17th. online ticket booking will begin from monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X