వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్‌ బస్సులు- జనవరి 8 నుంచి 3607 సర్వీసులు...

|
Google Oneindia TeluguNews

ఏపీలో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్‌ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి రద్దీ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్న ఆర్టీసీ అధికారులు... ఆ మేరకు స్పెషల్‌ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి రిజర్వేషన్‌, ఛార్జీల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఏపీలో సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని వివిధి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 3607 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో అన్ని కేటగిరీల సర్వీసులు ఉన్నాయి. జనవరి 8 నుంచి 13వ తేదీ వరకూ ఈ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వీటి కోసం ప్రత్యేక రిజర్వేషన్‌తో పాటు ప్రత్యేక ఛార్జీలు కూడా అమలు చేయనున్నారు.

apsrtc to run 3607 special services from january 8th to meet sankranti festival rush

హైదరాబాద్‌ నుంచి ఏపీకి ఉండే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని 1251 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ స్పెషల్‌ సర్వీసులు నడుస్తాయి.

బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులను నడపనున్నారు. ఏపీలోని వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటి ఛార్జీలను త్వరలో ప్రకటిస్తారు.

English summary
andhra pradesh road transport corporation has announced to run 3607 special bus services to meet sankranti festival rush. these services will run from 8th january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X