వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిపీటలెక్కుతున్న వైసీపీ ఎంపీ: 17న కళ్యాణ ముహూర్తం..!

|
Google Oneindia TeluguNews

ఎంపీల్లోనే అతి పిన్న వయస్కురాలు. అందరిలోకి అత్యంత తక్కువ ఆస్తి కలిగిన ఎంపీ. జాతీయ స్థాయిలోనూ మీడియా ప్రత్యేక కధనాలు ప్రసారం చేసింది. తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ సీనియర్ ను ఓడించి రికార్డు స్థాపించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైసీపీ ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధవి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఎంపీ స్వగృహంలో వివాహ నిశ్చితార్థ కార్యక్రమం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి శరభన్నపాలెంలో మాధవి వివాహం చేసేందుకు నిర్ణయించారు.

అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!

శరభన్నపాలెంలో 17న మాధవి కల్యాణం
ఏపీలో ఏకైక ఎస్టీ ఎంపీ గొడ్డేటి మాధవి. దివంగత మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె. అతి చిన్న వయసులోనే ఎంపీ అయ్యారు. అందునా కిషోర్ చంద్రదేవ్ లాంటి సీనియర్ నేతను ఓడించారు. మాధవి కి వివాహం నిశ్చమయమైంది. నిశ్చితార్ధ కార్యక్రమంలో ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల 17వ తేదీ రాత్రి శరభన్నపాలెంలో మాధవి వివాహం చేసేందుకు నిర్ణయించినట్లు ఆమె సోదరుడు మహేష్‌ తెలిపారు.

Araku loksabha member Goddeti Madhavai marriage fixed on 17th of this month in Visakha

గొలుగొండ మండలం కృష్ణదేవి పేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో మాధవి వివాహం జరగనుంది. ఎంపీ మాధవిని వివాహమాడుతున్న వప్రసాద్‌ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం నర్సీపట్నంలో ఒక ప్రైవేటు కళాశాల కరస్పాండెంట్‌గా పనిచేస్తూ, పోటీపరీక్షలకు తర్ఫీదు ఇచ్చేందుకు శివ ఎడ్యుకేషనల్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు విజయకుమారి, నారాయణమూర్తి. మాజీ ఎమ్మెల్యే దేముడుకు ప్రసాద్‌ తండ్రి నారాయణమూర్తి ప్రాణస్నేహితుడు. వీరి కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు మాధవి, ప్రసాద్‌లకు వివాహం చేసేందుకు నిశ్చయించారు.

ఎన్నిక ద్వారా ప్రత్యేక ఫోకస్..
అరకు నుండి ఎంపీగా గెలిచిన మాధవి పేద..గిరిజన ఎంపీ. మాధవి గురించి అప్పట్లోనే జాతీయ మీడియా అనేక కధనాలు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లయ్ గా, పీఈటీగా పని చేస్తూ ఉండిన మాధవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అరకు నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గిరిజన వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలనే ఆలోచన చేసింది.

ఆ సమయంలో వైసీపీ నుండి మాధవి పేరు తెర మీదకు వచ్చింది. అయితే..వైసీపీ నాయకత్వం అందుకు ముందుకు రాకపోవటం..మాధవి తొలి సారి ఎంపీ కావటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇక, ఇప్పుడు ఎంపీ పెళ్లి ముహూర్తం ఖరారైన విషయం పార్టీ నేతలకు అందించారు. ముఖ్యమంత్రి జగన్ ను తమ వివాహానికి ఆహ్వానించేందుకు కాబోయే దంపతులు సోమ వారం ముఖ్యమంత్రిని కలవనున్నారు.

English summary
Araku loksabha member Goddeti Madhavai marriage fixed on 17th of this month in Visakha. She was the younger in present Loksabha and also very poor. she defeated senior politician Kishore chandra deo in recent elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X