వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అరకు ఎంపి కొత్తపల్లి గీతకు డెంగ్యూ ఫీవర్...ఢిల్లీ లోహియా ఆస్పత్రిలో చికిత్ప
అరకు నియోజకవర్గం పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ ఫీవర్ బారిన పడినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆమె ఢిల్లీ లోని రామ్ మనోహర్ లోహయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపి గీతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎంపి కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని , అందువల్ల అప్పటివరకు లోహియా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని ఎంపీ కార్యాలయం పేర్కొంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!