• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను ఇలా చేస్తా: కొత్తపార్టీని ప్రకటించిన కొత్తపల్లి గీత, బాబు-జగన్‌లపై తీవ్రవ్యాఖ్యలు

By Srinivas
|

అమరావతి: విశాఖపట్నం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత రాజకీయ పార్టీని ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తన పార్టీ పేరును, జెండాను ప్రకటించారు. పార్టీ పేరును జన జాగృతి పార్టీగా తెలిపారు. పార్టీ గుర్తు తెలుపు, నీలం రంగుల్లో ఉండి, మధ్యలో గొడుగు గుర్తు ఉంది.

ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడారు. తమ పార్టీ మహిళా ప్రాధాన్యంగా సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌కు తప్ప ఎవరికీ రాష్ట్రంలో ఉద్యోగం రాలేదని ధ్వజమెత్తారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా నిప్పులు చెరిగారు.

కులాధిపత్యంతో రాష్ట్రంలో పాలన

కులాధిపత్యంతో రాష్ట్రంలో పాలన

ప్రజల దేవాలయం అయిన అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని కొత్తపల్లి గీత ఆరోపించారు. కులాధిపత్యంతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. జన జాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తుందని తెలిపారు.

ఆరు నెలలకోసారి ఎమ్మెల్యేలపై సామాజిక ఆడిట్

ఆరు నెలలకోసారి ఎమ్మెల్యేలపై సామాజిక ఆడిట్

ఆరు నెలలకు ఓసారి ఎమ్మెల్యేల పైన సామాజిక ఆడిట్ చేయిస్తామని కొత్తపల్లి గీత తెలిపారు. ఈ నెల 21వ తేదీన తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు రాజీనామాను ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.

 డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశానని

డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశానని

తాను గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశానని, నాలుగున్నరేళ్లుగా తాను ఎంపీగా ఉన్నానని కొత్తపల్లి గీత చెప్పారు. తాను ప్రజల సమస్యలను చాలా దగ్గరగా చూశానని ఆమె చెప్పారు. ఈ అనుభవంతో తాను ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టినట్లు తెలిపారు. ఉద్యోగాలు, ఉపాధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను తీవ్రంగా మోసం చేశారన్నారు.

వారికి ప్రాధాన్యం

వారికి ప్రాధాన్యం

జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవని కొత్తపల్లి గీత విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎక్కువగా ఉందన్నారు. జన జాగృతి పార్టీలో యువతకు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తాము ప్రజలతో మమేకమై మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. స్థానిక సమస్యల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టోను తయారు చేస్తామన్నారు.

వారికి టిక్కెట్లు ఇస్తాం

వారికి టిక్కెట్లు ఇస్తాం

స్వాతంత్ర్యం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఏ సామాజిక వర్గానికి రాజకీయాల్లో అన్యాయం జరిగిందో వారికి ప్రాధాన్యత ఇస్తామని గీత చెప్పారు. అలాంటి వారిని అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. వారు అధికారం గురించే ఆలోచిస్తున్నారన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Araku MP Kothapalli Geetha here on Friday launched new regional party, Jana Jagruti Party. She also launched the party’s logo and flag claiming that it would represent women and the neglected sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more