వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుపై దాడి: ఎంపి అంజన్ కొడుకు అరవింద్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

MP Anjan Kumar Yadav
హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్ అరెస్టయ్యారు. మంగళవారం ఆయనను నగర సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పోలీసులపై దాడి చేసిన కేసును అరవింద్ యాదవ్ ఎదుర్కొంటున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో అరవింద్ యాదవ్ పైన కేసు నమోదయింది. రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

హోలీ సందర్భంగా అరవింద్ యాదవ్ పోలీసు పైన దాడి చేసినట్లు కేసు నమోదయింది. ఆయనను వెతికేందుకు సౌత్ జోన్ పోలీసులు రెండు టీంలను ఏర్పాటు చేశాయి. పోలీసుల పైన దాడి చేసిన తర్వాత అరవింద్, ఆయన స్నేహితులు పారిపోయారని చెప్పారు. మరోవైపు, తన తనయుడు అరవింద్ కుమార్ యాదవ్ పోలీసుల పైన దాడి చేశారనేది అవాస్తవమని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.

కాగా, హైదరాబాదులోని పాతబస్తీ హుస్సేనీ ఆలంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌పై సికింద్రాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ తన ప్రతాపం చూపించిన విషయం తెలిసిందే. రోడ్డుపై హోలీ వేడుకలు ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగినందుకు కానిస్టేబుల్‌పై అరవింద్ యాదవ్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని కానిస్టేబుల్ చెప్పడమే తప్పయిపోయిందని అంటున్నారు. ఈ ఘటన పైనే పోలీసులు అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.

English summary
The South Zone police arrested MP Anjan Kumar Yadav's son Aravind Kumar Yadav on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X