వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అయితే ఈ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.

ఎన్జీటీ లో తెలంగాణా పిటీషనర్ తరపు వాదనలు

ఎన్జీటీ లో తెలంగాణా పిటీషనర్ తరపు వాదనలు

ఏపీ ప్రభుత్వం 40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల ఎత్తి పోసేలా మార్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రోజుకు ఎనిమిది టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.

 తమకు రావాల్సిన నీళ్ళే వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ వివరణ

తమకు రావాల్సిన నీళ్ళే వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ వివరణ

అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదని, తమకు రావాల్సిన నీళ్లనే తాము తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం దృష్టికి తమ వాదన తీసుకువెళ్లారు. కమిటీ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని , ఇందులో తెలంగాణాకు జరిగే నష్టం ఏమీ లేదని కాబట్టి ఈ కేసును ఇంతటితో ముగించాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు.

Recommended Video

Upasana Konidela On Chenchu Tribes Life Style | మాంసం తినండి.. కానీ..!
కేంద్ర పర్యావరణ శాఖ వైఖరి చెప్పాలని కోరిన ఎన్జీటీ... తీర్పు రిజర్వ్

కేంద్ర పర్యావరణ శాఖ వైఖరి చెప్పాలని కోరిన ఎన్జీటీ... తీర్పు రిజర్వ్


ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసు విషయంలో తమ వైఖరి ఏంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేస్తున్నట్టు చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. కౌంటర్ అఫిడవిట్ ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రాయల సీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీం మెట్లెక్కింది .

English summary
An NGT tribunal in Chennai has heard a petition filed by Gavinolla Srinivas, a native of Telangana, against the Rayalaseema lift irrigation scheme.after hearing Arguments on behalf of the petitioner, the AP Government NGT reserved judgment . The Union Environment Ministry has been directed to respond on the case within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X