శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా కోసం ఢిల్లీలో ఆత్మ‌హ‌త్య : శ‌్రీకాకుళం వాసిగా గుర్తింపు: సీయం దీక్ష వేళ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపికి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. రెండు రోజుల క్రితం నంద్యాల కోర్టు ఆవ‌ర‌ణ లొ ఓ న్యాయ‌వాది ప్ర‌త్యేక హోదా కోసం ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డారు. ఏపికి హోదా ఇవ్వాల‌ని.. విభ‌జ‌న హామీ లు అమ‌లు చేయాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి దీక్ష చేస్తున్న స‌మ‌యంలో ఢిల్లీలోనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది.

హోదా కోసం ఆత్మ‌హ‌త్య‌..
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కింతలికి చెందిన దవళ అర్జున్ రావు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నా రు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్‌పై ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అర్జున్ మృతదేహా న్ని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ తెలుగులో రాసి ఉం దని పోలీసులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్ల‌మంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్ వ‌ద్ద మృత‌దేహం ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను పోలీసులు సేక‌రిస్తున్నారు.

Arjun From Srikakulam Committed suicide demanding Special status for Ap

దీక్షా స్థ‌లిలో సంతాపం..
ఏపి కి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న డిమాండ్ల సాధ‌న కోసం ఏపి భ‌వ‌న్ వ‌ద్ద ముఖ్య‌మంత్రి దీక్ష చేస్తున్నారు. ఏపి నుండే కాకుండా పలువురు జాతీయ నేత‌లు దీక్షా స్థ‌లి వ‌ద్ద‌కు వ‌చ్చి మద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ దీక్షా స్థ‌లి వ‌ద్ద‌కు వ‌చ్చి ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో అర్జున్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన స‌మాచారం తెలియ‌వ‌చ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు దీక్షా స్థలిలోనే సంతాపం ప్రకటించి... మౌనం పాటించారు. ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ , దీక్షా స్థ‌లి తో ఉన్న ఇత‌ర‌ నేతలు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

English summary
AP person committed suicied in Delhi. Mr Arjun from Srikakulam of Andhra pradesh suicide in Delhi on demanding specia l status for AP. Police found a letter from him why he committed suicide. Cm Chandrab Babu and other leaders grief over Arjun suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X