వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడ అనుష్క.. అక్కడ పూనం: మరో జవాన్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ దేశీయురాలికి చేరవేసిన సుబేదార్‌ పతన్ కుమార్‌ పొద్దార్‌ వ్యవహారంలో ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. ఇప్పటికే పతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రెండో నిందితురాలిగా ఉన్న అనుష్క అగర్వాల్‌ కోసం కూపీ లాగుతున్నారు. పతన్‌కు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినందుకు మీరట్‌కు చెందిన అసిఫ్‌ అలీని అరెస్టు చేశారు.

తాజాగా ఆదివారం మీరట్‌కు చెందిన మరో జవాన్‌ను మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పూనం అనే పేరుతో అసిఫ్‌ అలీతో చాటింగ్‌ చేసిన కేసులో ఇతణ్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన ఆర్మీ జవాన్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాకు చెందిన సునీల్. 2012 డిసెంబరులో హిమాచల్ ప్రదేశ్ ఝాన్సీ కంటెన్మెంటులో జవానుగా చేరాడు. గత జూన్‌లో అలీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తన పేరు పూనం అని, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండే తను ఆర్మీ పరిశోధకురాలిగా పని చేస్తున్నట్లు నమ్మించాడు.

Army jawan arrested for sharing vital information

అలీని విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్‌ పోలీసులు మీరట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్పు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు అలీకి లింక్‌లు ఉన్న మరో జవాన్‌ పోలీసులకు చిక్కడం కలకలం ఆర్మీలో కలకలం రేపుతోంది. అలీతోపాటు ఇతడినీ సీసీఎస్‌ పోలీసులు విచారించాల్సి ఉంది.

ఆర్మీ సమాచారం దేశ సరిహద్దులు దాటిందని తెలియడంతో ఇంటెలిజెన్స్‌, ఆర్మీ, రా (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌), ఎస్‌ఐబీ విభాగాధికారులు రంగంలోకి దిగారు. ఇలా ఒక్కొక్కరుగా పోలీసులకు పట్టుబడుతుండడాన్ని చూస్తుంటే పతన్ కుమార్‌ అన్ని రాష్ట్ర్లాల్లోని ఆర్మీ విభాగాల్లో తనకంటూ ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే, అధికారులు మాత్రం పతన్‌కు అంత సీన్‌ లేదని చెబుతున్నారు.

English summary
acting on a tip-off by a man arrested here on suspicion of being an ISI agent, the special task force (STF) on Saturday arrested an Indian Army jawan who was suspected to have sent vital information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X