• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాట్‌గా 'అనుష్క' ట్రాప్: పతాన్ నోట భయంకర నిజాలు

By Srinivas
|

హైదరాబాద్: పాకిస్తాన్ గర్ల్‌గా భావిస్తున్న అనుష్క అగర్వాల్ 'హానీ ట్రాప్'లో సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ పడిన విషయం తెలిసిందే. పతన్ రిమాండ్ రిపోర్టు ద్వారా భయంకరమైన నిజాలు వెల్లడైనట్లుగా సమాచారం. సమాచారం మేరకు... అనుష్క ఆర్మీ కీలక విభాగాల అధికారుల కదలికలను అడిగింది. పతన్‌ను నందన్ ట్రిప్‌కు తీసుకు వెళ్తానని చెప్పింది. కీలక విభాగాలలో ఉన్న 40 మంది అధికారుల వివరాలు అడిగిందట.

2013 జూలైలో రూ.74వేల చెక్కును పతన్‌కు పంపించింది. దేశంలో ఉన్న పన్నెండు బ్రిగేడర్ల పేర్లు, ప్రదేశాల వివరాలు పతాన్‌ను అడిగిందట. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఆర్మీ సమాచారాలు ఇచ్చాడట. పతాన్‌ను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆర్మీ, మిసైల్ స్టోరేజ్ వివరాలు అడిగింది.

Army officer arrested for sharing military secrets with Pak woman!

పతాన్‌కు, అనుష్కకు 2013లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆర్మీ మిసైల్, ఆయుధ నిల్వల కర్మాగారం వివరాలను, ఫోటోలను పంపాలని అనుష్క కోరిందని పోలీసుల విచారణలో వెల్లడైందట. అతని పైన అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 3, 4, 5 సెక్షన్లు, 1977 ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ బాన్నింగ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

4 పెన్‌డ్రైవ్‌లు, 4 డైరీలు...

పోలీసులు పతాన్ నుండి నాలుగు పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, 3 ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 డైరీలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ పతాన్....

పతాన్ గతంలో జమ్ముకాశ్మీర్, నాసిక్‌లలో పని చేశాడు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. 1996లో అతను ఆర్మీలో చేరాడు. పతాన్.. అనుష్కను కలుసుకోవాలని పలుమార్లు ప్రయత్నించాడు. అయితే, ఆమె ఏదో చెప్పి తప్పించుకుంది. ఆమె తన న్యూడ్ ఫోటోలు, తాను స్నానం చేసిన వీడియోలు పంపించింది. దీంతో అతను ఆమె ట్రాప్‌లో పడిపోయాడు. ఎన్నో విషయాలు చెప్పాడట.

మల్టీలెవల్ మార్కెటింగ్‌లో...

పతాన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాడు. కమిషన్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడు. అతను ఇద్దరు వ్యక్తులతో కలిసి మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తున్నాడు. చైనా విదేశీ కార్యాలయంలో పని చేసే ఇద్దరితో ఇతను ఈ వ్యాపారంలోకి వచ్చాడు.

ఇదీ అనుష్క అగర్వాల్!

పాకిస్తాన్ గర్ల్‌గా అనుమానిస్తున్న అనుష్క అగర్వాల్ పేరుతో పతాన్‌కు పరిచయమైన యువతి ఫేస్‌బుక్ అడ్రస్ జైపూర్‌గా ఉంది. పతాన్‌తో నెలలుగా చాటింగ్ చేస్తోంది. పరిచయం పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా తన న్యూడ్ ఫోటోలు పంపించింది. అంతేకాదు, తాను స్నానం చేస్తున్న వీడియోలను పంపించింది. దీంతో పతాన్ ఆమెకు బుక్కయ్యాడు. పలు విషయాలు ఆమెకు చెప్పాడు.

నమ్మించి ట్రాప్‌లో పడేసింది

తాను రీసెర్చ్ స్కాలర్‌ని అని పతాన్‌ను అనుష్క నమ్మించింది. న్యూడ్, సెక్సీ ఫోటోలు పంపించింది. పతాన్ కంప్యూటర్ పూర్తి వివరాలను చూసే సాఫ్టువేర్‌ను ఫ్రాక్సీ డేటా షేర్ ద్వారా అనుష్క సేకరించిందని భావిస్తున్నారు. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేశారని నమ్మించింది. అనుష్క పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే, ఆమె భారత్‌కు చెందిన వ్యక్తా? లేక పాకిస్తాన్ వ్యక్తా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమెను పాకిస్తానీగా అనుమానిస్తున్నారు.

English summary
Army officer arrested for sharing military secrets with Pak woman!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X