వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిలిచిన ఆరోగ్య శ్రీ : 80వేల రోగుల క్లెయిమ్‌లు పెండింగ్‌..

|
Google Oneindia TeluguNews

Recommended Video

NTR Aarogyasri Trust Services Stopped In AP

ఏపిలో ఎన్టీఆర్ వైద్య సేవ ప‌రిధిలో నిర్వ‌హిస్తున్న వైద్య సేవ‌లు నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు..ఎమ‌ర్జెన్సీ కేసుల‌కు మాత్ర‌మే సేవ‌లు అందిస్తున్నారు. త‌మ సమ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌క‌పోతే సేవ‌లు నిలిపివేస్తామ‌ని రెండు నెల‌లుగా ఆశా ప్ర‌తినిధులు హెచ్చ‌రిస్తున్నారు. ఆ త‌రువాత మంత్రి హామీ ఇచ్చినా.. ఇక్క స‌మ‌స్య కూడా ప‌రిష్కారం కాలేదు. దీంతో..సేవ‌ల‌ను నిలిపివేసారు.

Arogya Sri Services stalled : 80,00 claims to be solved..

నిలిచిన సేవ‌లు..రోగుల ఇక్క‌ట్లు..

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం కోసం వచ్చినవారిని వెనక్కి పంపిస్తున్నాయి. బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకు న్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో 3 నెలలుగా ఆశా ప్రతినిధులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలే దు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ దాదాపు 80వేల రోగుల క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెట్టింది. వాస్త‌వంగా కొద్ది రోజుల క్రిత‌మే త‌మ స మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ స‌మ్మె నోటీసు ఇచ్చారు. అయితే, కొత్త‌గా మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టిన ఫ‌రూక్ ఆశా ప్ర‌తినిదుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. త్వ‌రోల‌నే స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే , మంత్రి ఇచ్చిన హామీల్లో ఏవీ అమ‌లు కాక‌పోవ‌టంతో...సేవ‌ల‌ను నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

80 వేల క్లెయిమ్స్‌..400 కోట్లు ..

ఎన్టీఆర్ వైద్య‌సేవ ట్ర‌స్ట్‌లో పాల‌న అస్త‌వ్య‌స్తంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. నిధుల కొర‌త‌..సిబ్బంది అంతంత మాత్రంగా ఉండ‌టంతో.. ట్ర‌స్ట్ ఇబ్బందుల్లో ఉంది. ట్ర‌స్ట్ ఏపి - తెలంగాణ మ‌ధ్య విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత ఏపి ట్ర‌స్ట్ లో కొత్త సిబ్బందిని నియ‌మించ‌లేదు. నెట్ వ‌ర్క్ ఆస్ప‌త్రుల నుండి ప్ర‌తీ రోజుల అయిదు నుండి ఎనిమిది వేల వ‌ర‌కూ క్లెయిమ్స్ వ‌స్తూనే ఉన్నాయి. కానీ, ప్ర‌స్తుతం గ‌రిష్ఠంగా రెండు వేల క్లెయిమ్స్ ను మాత్ర‌మే ప‌రిష్క‌రించే ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ట్ర‌స్టు వ‌ద్ద దాదాపు 80 వేల క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీటి విలువ 400 కోట్ల పై మాటేన‌ని అధికారులు చెబుతున్నారు.

English summary
NTR Arohyasri Trust services stopped in AP. NTR trust have to clear nearly 80,000 claims value of 550 cr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X