వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్ ఒకటి నుండి మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు : ఏపీ సీఎం

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యశ్రీ సేవలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనేపథ్యంలోనే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలపై తీసుకున్న పలు నిర్ణయాల అమలు చేయాలని చెప్పారు. దీంతో నవంబర్ 1నుండి హైదారాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూర్ నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష సమావేశం సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులను చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు డిశంబర్ ఒకటి నుండి ఆరోగ్యశ్రీ ద్వార ఆపరేషన్‌లు చేసుకున్నవారికి నెలకు అయిదువేల రుపాయలు ఇవ్వాలని సూచించారు.

Arogyasri services in metro cities from November 1 : AP CM

ఇక ఇదివరకే నిర్ణయించినట్టుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు తలసేమియా,హిమోఫిలీయాతోపాటు లాంటీ దీర్ఘకాలిక వ్యాధులు, మరియిు కుర్చికే పరిమితమైన కదలలేని స్థితిలో ఉన్నవారికి సైతం ఇబ్బందిపడుతున్నవారికి నెలకు 10వేల రుపాయలను ఆర్ధిక సహాయం చేయాలని సూచించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందుల్ని ఉంచడం లాంటీ చర్యలు చేపట్టాని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి 16000 రుపాయలను పెంచుతూ జీవో జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రులకు వస్తే డబ్బుల కోసం వేచి చూడకుండా చికిత్స అందించాలని ఆదికారులకు సూచించారు.

English summary
AP CM Jagan Mohan Reddy conducted a review meeting on health services. Several orders have been issued to the authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X