కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: అమ్మ ఫోటో పక్కనే నా ఫోటో అఖిల ప్రియాకు చెప్పిన భూమా

అమ్మ ఫోటోతో పాటు నా ఫోటో కూడ ఉంటే బాగుంటుంది .గుంటూరులో ఇంటికి నా ఫోటో అందంగా తయారు చేయించి పెట్టాలని భూమానాగిరెడ్డి అఖిలప్రియకు చెప్పాడు. ఈ మాటలు అన్న కొద్ది గంటల్లోనే ఆయన మృత్యువాత పడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: అమ్మ ఫోటోతో పాటు నా ఫోటో కూడ ఉంటే బాగుంటుంది, గుంటూరులో ఇంటికి నా ఫోటో ను కూడ అందంగా తయారు చేయించి పెట్టాలని దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు చెప్పారు.ఈ మాటలు అన్న కొన్ని గంటల్లోనే భూమా గుండెపోటుతో కన్నుమూశారు.ఈ మాటలను గుర్తుకుతెచ్చుకొన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమౌతున్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం కోసం భూమా నాగిరెడ్డి శ్రమిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై మాట్లాడేందుకుగాను భూమా నాగిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో ఈ నెల 11వ, తేదిన విజయవాడలో గంటన్నర పాటు సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారిద్దరూ చర్చించారు.అంతేకాదు తన వర్గానికి చెందిన ప్రజా ప్రతినిదులతో శిల్ప చక్రపాణిరెడ్డికి ఓటు చేయించి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు.

arrange my photo beside your mother's photo:bhuma nagi reddy

ఈ సమావేశం పూర్తైన తర్వాత భూమా నాగిరెడ్డి విజయవాడ నుండి నేరుగా ఆళ్ళగడ్డకు చేరుకొన్నారు.రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఆళ్ళగడ్డకు చేరుకొన్నారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే శోభా నాగిరెడ్డి పెద్ద ఫోటో ఉంటుంది.

శోభా నాగిరెడ్డి ఫోటో వద్దకు చేరుకొని ఈ పోటో పక్కనే నా ఫోటో కూడ ఉంటే బాగుంటుంది కదా అంటూ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.గుంటూరులోని ఇంట్లో కూడ అమ్మ ఫోటోతో పాటు నా ఫోటో కూడ అందంగా తయారు చేయించి పెట్టాలని ఆయన అఖిలప్రియను కోరారు.

భోజనం చేసి పడుకొన్నారు.అయితే ఉదయం పూట అఖిల ప్రియ తండ్రి నాగిరెడ్డి లేపింది. అహోబిలం వెళ్ళాలని ఆమె కోరింది. అయితే తనకు కొంచెం అలసటగా ఉందని రాలేనని ఆయన చెప్పాడు.దీంతో అఖిలప్రియ ఒక్కతే అహోబిలం వెళ్ళింది.

ఆలస్యంగా నిద్రలేచిన భూమా నాగిరెడ్డి స్నానం చేసి రడీ అయి టిఫిన్ చేసి తన రెండో కూతురుకు మాత్రలు ఇవ్వాలని కోరాడు.అయితే ఆమె మాత్రలు తెచ్చి ఇచ్చేలోపుగానే ఆయన ఫిట్స్ వచ్చి కుర్చీలో కూర్చుండిపోయారు.

ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి నంద్యాలకు తరలించారు.అయితే అప్పటికే విషమ పరిస్థితిలో ఉన్న భూమా నాగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

English summary
arrange my photo beside your mother's photo said bhuma nagireddy on saturday night. bhuma nagireddy returned from vijayawada saturday night allagadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X