గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో తొలి ఇఫ్తార్‌కు విస్తృత ఏర్పాట్లు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లింల‌కు ఇఫ్తార్ ఇవ్వ‌నుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ ఇఫ్తార్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 12 వేల మంది ముస్లింలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు వేల ముస్లిం మ‌త పెద్దల‌ను ఆహ్వానించారు.

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే ముస్త‌ఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఈ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన తొలి ఇఫ్తార్ కావ‌డంతో ఎక్క‌డా, ఎలాంటి లోటుపాట్ల‌కు అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. క‌డ‌పలోని అమీన్‌పీర్ ద‌ర్గా పెద్ద‌లతో పాటు నాలుగు వేల‌మంది వర‌కు మౌల్వీలు, మ‌సీదు క‌మిటీల ఛైర్మ‌న్లు, వ‌క్ఫ్ బోర్డు ప్ర‌తినిధుల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు.

arrangements are full swing for Iftar in Guntur by the AP Government
English summary
Arrangements go on full swing for Iftar treat to Muslims in Andhra Pradesh. The Iftar treat made by Government of Andhra Pradesh. The arrangements happened in Police parade grounds in Guntur. At least, 12,000 invitees likely to be attend in this Program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X