వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడిపందాలకు జోరుగా ఏర్పాట్లు: అడ్డుకొనేందుకు పోలీసుల పాట్లు: ప్రముఖులు సైతం..!

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాల్లో జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పందాలను అడ్డుకునేందుకు పోలీసుల యత్నాలు చేస్తున్నా..ఎప్పటిలాగే సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ప్రముఖులు ఇక్కడకు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతికి సొంత గ్రామాలకు తరలి వస్తున్నారు. ఈ పండుగ పేరుతో నిర్వహించే కోడి పందాల్ల కోట్లాది రూపాయాలు చేతులు మారుతూ ఉంటాయి. ముందస్తు బైండోవర్లు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పందాల నిర్వాహకులు మాత్రం ధీమాగానే ఉన్నారు. తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు.

ప్రైవేట్ బస్సుల సంక్రాంతి బాదుడుపై దృష్టి.. అడ్డగోలుగా దోచేస్తే కేసులేనట !!ప్రైవేట్ బస్సుల సంక్రాంతి బాదుడుపై దృష్టి.. అడ్డగోలుగా దోచేస్తే కేసులేనట !!

మూడు రోజుల సంబరాలు..
సంక్రాంతి సంబరాలు.. కోడి పందాలు అంటే వెంటనే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలకు ఏడాదంతా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా ధర పలుకుతుంది. పందెంలో గెలిచిన కోడి దర్జాగా యజమాని భుజం మీదకు చేరితే.. పోరాడి ఓడిన కోడి కూరగా మారిపోతుంది.

Arrangements started in Godavari Distrcits for cock fights

పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడికి సైతం విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీన్ని కూర వండి, బంధుమిత్రులకు పంపించడం గోదావరి జిల్లాల ప్రజలు స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. సంక్రాంతి సమయంలో రాజకీయ, పారిశ్రామిక రంగాలతోపాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. ప్రతిఏటా పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం వస్తుంటారు. ఇప్పుడు సైతం అక్కడ అదే పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణ ప్రముఖులు సైతం ఆసక్తి..
ఏపీలోని పలు జిల్లాలకు చెందిన రాజకీయ..వ్యాపార ప్రముఖులతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖులు సైతం భీమవరానికి రానున్నట్లు సమాచారం. సంక్రాంతికి నిర్వహించే కోడిపందాలే గోదావరి జిల్లాల్లో స్పెషల్‌ ఈవెంట్‌. గతంలో సరదా కోసం, సాంప్రదాయంగా కోళ్లను బరిలో దించేవారు. ఇప్పుడు బెట్టింగ్‌ల కోసం పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ.కోట్లాది చేతులు మారుతున్నాయి. ఈసారి మరింత భారీగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు.

కోడి పందాలను చూసేందుకు బంధువులతోపాటు పొరుగు ప్రాంతాల్లోని మిత్రులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే అతిథులు సైతం కోడి పందాలను ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారంటూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Cock fight bettings to be start in Godavari dsitricts as pongal sepcial. Well known persons planning to watch cock fight in Godavari area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X