వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేసింది రైతు, ఓ వ్యాపారీ....! డీజీపీ వివరణ, ఖండించిన బాబు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత అమరావతి పర్యటన ఉద్రిక్తతంగా కొనసాగింది. అనుకూల, వ్యతిరేక నినాదాలు, ఆందోళనల నడుమ మాజీ సీఎం చంద్రబాబు పర్యటన అమరావతిలో ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ... రాజధాని ప్రాంత రైతులు, ఇతర వ్యాపారులు నల్లబ్యాడ్జీలతో నిరసలను వ్యక్తం చేయగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసన వ్యక్తం చేసిన వారిని అరెస్ట్ చేశారు.

చెప్పులు, రాళ్లు వేసిన వారు అరెస్ట్

చెప్పులు, రాళ్లు వేసిన వారు అరెస్ట్

అయితే అరెస్ట్ అయిన వారు వివరాలతో పాటు ఎందుకు రాళ్లు, చెప్పులు రువ్వారనే అంశంపై విచారించారు. ఆ వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరిని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్లే తాము ఆర్ధిక నష్టపోయామని, అందుకే కాన్యాయ్‌పై చెప్పులు, రాళ్లు రువ్వామని చెప్పారు. తమకు అన్యాయం జరగడం వల్లే అలా చేశామని ఒప్పుకున్నట్టు డీజీపీ వివరించారు... అయితే బస్సుపై చెప్పులు విసిరింది ఓ రైతు కాగా రాళ్లు విసిరింది ఓ వ్యాపారీ అని తెలిపారు.

ఆందోళనలు ఉండవని అనుకున్నాం

ఆందోళనలు ఉండవని అనుకున్నాం

ఇక చంద్రబాబు పర్యటనలో భాగంగా ఎలాంటీ అందోళనలు , ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోవడం వల్లే ఆయన పర్యటనకు అనుమతిచ్చామని డిజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటీ పోలీసు నిబంధనలు అమల్లో పెట్టలేదని చెప్పారు. మరోవైపు ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్చ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని ఆయన ఈ సంధర్భంగా వివరించారు. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి తాము వ్యాఖ్యానించమని చెప్పారు..

డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన బాబు

డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన బాబు

అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎలాంటీ అందోళనలు జరగవనే..సమాచారంతోనే ఎలాంటీ సెక్షన్లు అమలు చేయలేదని , పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయలేదని డీజీపీ చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిపై రాళ్లతో, చెప్పులతో వైఎస్ఆర్ కార్యకర్తలు దాడులు చేస్తే... సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సంఘటన జరుగుతున్నప్పుడు కూడ డీఎస్పీ అక్కడే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు డీజీపీ వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోసారి హైదరాబాద్ ప్రస్తావన తీసుకువచ్చిన బాబు

మరోసారి హైదరాబాద్ ప్రస్తావన తీసుకువచ్చిన బాబు

అమరావతి పర్యటన తర్వాత అమరావతిలో మీడియాతో మాట్లాడిన బాబు మరోసారి హైదరాబాద్ ప్రస్తావన తీసుకువచ్చారు. హైటెక్ సిటితో పాటు , సైబరాబాద్‌ను నిర్మించామని, విజన్‌ 2020తో ఎలాంటీ స్వార్థం లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ది చేశానని చెప్పారు. అదంతా ప్రజల కోసమే చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం విడిపోయన తర్వాత హైదరాబాద్‌ను మించిన అమరావతిని నిర్మించాలని భావించానని చెప్పారు. కాని కులం ప్రస్థావన తీసుకువచ్చి రాజకీయాలు తీసుకువస్తున్నారని అన్నారు. దీంతో ఏ కులం కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ది చేశానని ప్రశ్నించారు.

English summary
police arrested two persons who thrown cheppals and stones at the convoy of TDP chief Chandrababu naidu in Amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X