పటేల్ ఆశయాలతో: ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్: హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్ లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్ లు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. సమాజం కోసం పోలీస్ వ్యవస్థ అహర్నిశలు కష్టపడుతోందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని జైట్లీ పిలుపునిచ్చారు.