వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీ రమ్మన్నారు, ఏం చేద్దాం: సుజన, జాగ్రత్త... ఇప్పుడా అని చంద్రబాబు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రప్రదేశ్ డిమాండ్లకు అరుణ్ జైట్లీ నుంచి సానుకూల స్పందన !

అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొన్ని డిమాండ్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ విషయాన్ని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సీఎం చంద్రబాబుకు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తిఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తి

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై టీడీపీ గత కొద్ది రోజులుగా యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీకి హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామని బీజేపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇటీవలే రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

 ఆరు రోజులుగా అవిశ్వాసం నోటీసు

ఆరు రోజులుగా అవిశ్వాసం నోటీసు

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి రోజు ఢిల్లీలోని ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో చెబుతున్నారు. అక్కడ విషయాలు తెలుసుకుంటున్నారు. వైసీపీ కూడా ఉద్యమిస్తోంది. ఇరు పార్టీలు కేంద్రంపై ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైట్లీ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.

 జైట్లీ నాతో మాట్లాడారు ఏం చేద్దాం

జైట్లీ నాతో మాట్లాడారు ఏం చేద్దాం

ఈ రోజు (శుక్రవారం) జైట్లీ తనతో మాట్లాడారని, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం సహా అన్నీ ఇస్తామని చెప్పారని చంద్రబాబుతో సుజన చెప్పారు. అయితే ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఏం చేద్దామని చంద్రబాబును సుజన అడిగారు.

చంద్రబాబుకు ఫోన్ చేశారని

చంద్రబాబుకు ఫోన్ చేశారని

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా జైట్లీ ఫోన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. హామీలను నెరవేర్చుతామని, ఢిల్లీకి రావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా ప్రస్తావన తేలేదని సమాచారం. ఏం చేద్దామని సీనియర్ నేతలను చంద్రబాబు అడిగారు. దానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ స్పందించారు. కాగా, చంద్రబాబును ఢిల్లీకి కూడా ఆహ్వానించారని తెలుస్తోంది.

యనమలతో ఏకీభవించిన చంద్రబాబు

యనమలతో ఏకీభవించిన చంద్రబాబు

విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలు ఇలా అన్ని విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని యనమల చెప్పారు. ఎవరైనా కనిపించినప్పుడు మర్యాదగా పలకరించుకోవచ్చునని, కానీ ప్రస్తుతం కేంద్రమంత్రులను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వ్యాఖ్యానించారని సమాచారం. కేంద్రమంత్రుల కర్టసీ మీటింగులోను మన ఎంపీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యనమల మాటలకు చంద్రబాబు ఏకీభవించారు. కేంద్రం ఏం చేస్తుందో చూద్దామని చెప్పారని తెలుస్తోంది. కేంద్రం ఏమివ్వాలనుకుంటుందో ఇవ్వనీయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఆందోళనలు, నిరసన సమయంలో చర్చలు ఏమిటని ఆగ్రహించారని తెలుస్తోంది.కనిపిస్తే మాట్లాడండని, చాంబర్‌కు మాత్రం వెళ్లవద్దని చెప్పారు.

టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలపై తోట

టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలపై తోట

కేంద్రంపై శుక్రవారం కూడా టీడీపీ, వైసీపీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చాయి. సభసజావువుగా సాగితే చర్చలు చేపడతామని స్పీకర్ చెప్పారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించే వరకు అన్నాడీఎంకే, డీఎంకే మాత్రం నిరసనలు చేపడతామని చెప్పాయి. వారితో టీడీపీ సభ్యులు చర్చలు జరిపారు. అనంతరం తోట నర్సింహం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసానికి మద్దతిస్తున్న ఎంపీలతో పరేడ్ లేదా లేఖలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. సహకరించాలని అన్నాడీఎంకేను కోరినట్లు తెలిపారు. ఏపీకి ఇన్ని ఇచ్చామని చెబుతున్న కేంద్రం చర్చకు ఎందుకు సిద్ధం కావడం లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఏపీకి ఇవ్వాలన్నారు.

English summary
Union Minister Arun Jaitley talks with Telugudesam Party leader Sujana Choudhary over AP issues on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X