వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిపిలు: ఎపికి ప్రసాదరావు, టీకి అరుణ బహుగుణ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపిగా ఉన్న ప్రసాదరావు విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ డిజిపిగా కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ డిజిపి ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అరుణ బహుగుణకు తెలంగాణ డిజిపిగా ఎక్కువ అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం అపాయింటెడ్ డే దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలను రెండుగా విభజిస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖను కూడా విభజించేందుకు చేపట్టిన కసరత్తు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. భవనాలు, ఆస్తులు, సిబ్బంది ఇలా పంపకాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తి వివరాలను సేకరించాయి. తెలంగాణ డిజిపి కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న భవనాన్ని కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా నిర్మించిన సిఐడి కార్యాలయాన్ని కేటాయించేందుకు కసరత్తు పూర్తయింది.

Aruna Bahuguna may be DGP for Telangana

జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అధికారికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోతుంది. ప్రస్తుతం డిజిపిగా ఉన్న ప్రసాదరావే ఆంధ్రప్రదేశ్‌కు డిజిపిగా కొనసాగుతారు. తెలంగాణ డిజిపి పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై అటు పోలీసు శాఖతోపాటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం 1979 బ్యాచ్ అధికారులకు తెలంగాణ తొలి డిజిపి పదవి దక్కే అవకాశాలున్నాయి.

తెలంగాణ డిజిపి రేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి అరుణ బహుగుణ అందరికన్నా ముందున్నారు. అరుణ బహుగుణ హైదరాబాద్‌వాసి కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. కాగా ప్రస్తుతం ఆమె సెంట్రల్ డిప్యూటేషన్‌లో భాగంగా నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పిఎ) డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె సోమవారంనాడు కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు.

తెలంగాణ తొలి డిజిపి రేసులో తర్వాతి స్థానంలో ప్రస్తుత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి టిపి దాస్, ఎస్‌ఎ హోదా ఉన్నారు. వీరిద్దరు రాష్ట్రేతరులు, ఒకే రాష్ట్ర (ఒడిస్సా)కు చెందినవారు గమనార్హం. ప్రస్తుతం సమాన హోదా ఉన్న హుదా, టిపి దాస్ ఇద్దరు రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర విభజన, ఐపిఎస్‌ల పంపకాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.

వారితో పాటు 1981 బ్యాచ్‌కు చెందిన అధికారులు దుర్గాప్రసాద్, వివేక్ దుబే, ఎకె ఖాన్, జెవి రాముడు కూడా డిజిపి రేసులో ఉన్నారు. వీరిలో దుర్గాప్రసాద్, ఎకె ఖాన్, జెవి రాముడు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు. దీంతో వీరికి దాదాపుగా డిజిపి పదవి దక్కే అవకాశం తక్కువే.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు తెలంగాణ తొలి డిజిపి పదవి దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 1982 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శర్మ ఇటీవలే డైరెక్టర్ జనరల్‌గా కూడా పదోన్నతి పొందారు. ఈయన కూడా రాష్ట్రేతరుడే అయినప్పటికీ హైదరాబాద్ అల్లుడు కావడం అనురాగ్ శర్మకు కలిసొచ్చే అంశం. అరుణ బహుగుణ తెలంగాణ డిజిపి పదవిపై ఆసక్తి చూపకపోతే అనురాగ్ శర్మకే తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ అయ్యే అవకాశాలున్నాయి.

సీనియారిటీ ప్రకారం అనురాగ్ శర్మ కన్నా నలుగురు అధికారులు ముందున్నప్పటికీ రేసులో మాత్రం ఆయనే ముందున్నారు. కాగా తెలంగాణ డిజిపి పదవిని ఆశిస్తున్న చాలా మంది సీరియర్ అధికారులు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుస్తున్నారు.

English summary
Present DGP Prasad Rao will continue as the Andhra Pradesh DGP after the division. Aruna Bahuguna or Anurag Sharma may be appointed as Telangana DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X