• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాపు కార్పోరేష‌న్‌కు ఎంత‌: అగ్రిగోల్డ్ బాధితుల‌కు అండ‌గా ఉంటారా: ఆరోగ్య కేటాయింపులు ఎలా..!

|

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నాడు పాద‌యాత్ర స‌మ‌యంలో అనేక సామాజిక వ‌ర్గాల‌తో ఆత్మీయ స‌ద‌స్సులు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో వారంద‌రికీ అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్ర‌ధానంగా కాపు కార్పోరేష‌న్‌కు నాటి చంద్ర‌బాబు ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికి కంటే రెట్టింపు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా ఇత‌ర వ‌ర్గాల‌కు కార్పోరేష‌న్ల‌ను ఏర్పాటు చేసి బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేస్తామ‌ని చెప్పారు. ఇక‌, బీసీ - ఎస్సీ సంక్షేమం కోసం నిధులు ఏ విధంగా కేటాయిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. త‌న తండ్రి హాయంలో విధంగానే ఆరోగ్య‌శ్రీ పైన ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వ తొలి బ‌డ్జెట్‌లో ఆరోగ్య శ్రీ కి ఎంత మేర నిధులు కేటాయిస్తున్నానేది తేలి పోనుంది.

సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం..

సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం..

ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి బ‌డ్జెట్‌లో అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు..సంక్షేమ రంగానికి అధిక కేటాయింపు లు చేసిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు కాపు కార్పోరేష‌న్‌కు బ‌డ్జెట్‌లో రెండు వేల కోట్ల వ‌ర‌కు కేటాయిం చాల్సిన అవ‌స‌రం ఉంది. అదే విధంగా బీసీ..ఎస్సీ సంక్షేమానికి హామీలు ఎక్కువ‌గా ఉండ‌టంతో గ‌త ప్ర‌భుత్వం చేసి న కేటాయింపుల కంటే పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ మేర‌కే త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు ఉంటాయ‌ని మంత్రులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. ఆత్మహత్యకు పాల్పడటం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రూ. ఏడు లక్షల చొప్పున పరిహారం చెల్లిం చేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం పెళ్లి కానుక కింద బడ్జెట్‌లో కేటాయింపులు ఉండ‌నున్నాయి.

ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌త ఏ ర‌కంగా..

ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌త ఏ ర‌కంగా..

ఇప్ప‌టికే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌భుత్వ త‌మ విధానం స్ప‌ష్టం చేసింది. పోల‌వ‌రంతో పాటుగా వంశధార, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా బడ్జెట్‌ రూపొందించారు. ఇప్ప‌టికే కేసీఆర్‌తో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు కొన‌సాగింపుగా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదన బ‌డ్జెట్‌లో ప్ర‌తి పాదించే అవ‌కాశం ఉంది. చేనేత, మత్య్సకారులు, ఆటో డ్రైవర్లుతోపాటు అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకునేలా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు కేటాయింపులతోపాటు సహకార రంగం పునరుద్ధణకు నిధులు కేటాయించనున్నారు.

  సంక్షేమానికి బడ్జెట్ లో పెద్దపీట
  ఆరోగ్య రంగానికి 14 వేల కోట్ల‌కు పైగా..

  ఆరోగ్య రంగానికి 14 వేల కోట్ల‌కు పైగా..

  తాజా బ‌డ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి దాదాపు 12 వేల కోట్ల వ‌ర‌కు కేటాయింపులు చేసే అవ‌కాశం ఉంది. అదే విధంగా ఆస్ప‌త్రుల్లో మౌళిక వ‌స‌తుల కోసం మ‌రో రెండు వేల కోట్లు కేటాయిస్తార‌ని స‌మాచారం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదా యం కలిగిన అన్ని కుటుంబాలకు యూనివర్శల్‌ హెల్త్‌ కేర్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య తర గతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించనున్నారు. కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు కోసం కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో రూ.1,740 కోట్లను కేటాయించనున్నారు. దీని ద్వారా ఆరోగ్య శ్రీ అమ‌లు గురించి బ‌డ్జెట్‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

  English summary
  As Jagan assurance budget allocations for BC and SC welfare allocations seem to be high. For Kapu corporation it may be u[ to 2000 cr. Govt also concentrated on Arogyasri.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X