వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాన్‌కు పెరుగుతోన్న మద్దతు.. అన్ని పార్టీల్లోనూ పాజిటివ్ టాక్.. ఎన్టీఆర్ బాటలో జనసేనాని

|
Google Oneindia TeluguNews

పూర్తికాలం రాజకీయాలకే పరిమితం కావాలన్నఅభిప్రాయాన్ని సవరించుకుంటూ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడైన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఊహించని రీతిలోమద్దతు లభిస్తోంది. మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ద్వారా పవన్ కమిట్‌మెంట్ తప్పారంటూ పార్టీ నుంచి వెళ్లపోయిన జేడీ లక్ష్మీనారాయణ వాదన సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సినిమాల్లోకి పవన్ రీఎంట్రీని టీడీపీ, లోక్‌సత్తా పార్టీల నేతలు స్వాగతించారు. ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లాటివాళ్లు కూడా సినిమాలు తీశారని, తెలుగునాట ఎన్టీఆర్ బాటలో జనసేనాని నడవాలనుకోవడం మంచిదేనని నాయకులు అంటున్నారు.

డబ్బుకోసం చేస్తే తప్పేంటి?

డబ్బుకోసం చేస్తే తప్పేంటి?


సాధారణంగా పక్కవాళ్ల వ్యక్తిగత విషయాలకు దూరం పాటించే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అనూహ్యంగా పవన్ సినిమాలపై స్పందించడం చర్చనీయాంశమైంది. పవన్ బేసిగ్గా నటుడు కాబట్టి నటనను కొనసాగించడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చని జేపీ అభిప్రాయపడ్డారు. ఎలాంటి వ్యక్తులైనా సక్రమ మార్గంలో, నిజాయితీగా డబ్బులు సంపాదించాలనుకోవడం తప్పుకాదని, పవన్ సినిమాల ద్వారా ఆదాయాన్ని పొందాలనుకోవడాన్ని నేరంగా చూడాల్సిన అవసరంలేదని ఆయన చెప్పారు.

జేడీకి సూటి ప్రశ్న..

జేడీకి సూటి ప్రశ్న..


పార్టీ నుంచి వెళ్లిపోయేటప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లాంటివాళ్లు చేసిన విమర్శలకు పవన్ ఘాటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కోసం, తనపై ఆధారపడ్డవాళ్ల కోసమే సినిమాలు చేస్తున్నానని, తనకుగానీ లక్షల కోట్ల ఆస్తులు, కోట్ల రూపాయాల ఆదాయాన్నిచ్చే కంపెనీలు ఉండుంటే కచ్చితంగా సినిమాలు చేసేవాడినికానని పవన్ వివరించారు. తనను విమర్శిస్తున్నవాళ్లు జీవితంలో ఏనాడైనా సమాజం కోసం కనీసం వెయ్యిరూపాయల డబ్బు వదులుకున్నారా? అని జనసేనాని సూటిగా ప్రశ్నించడం అందరినీ ఆలోచింపజేసింది.

ప్రజల్లో నటించేకంటే తెరపైనే మంచిది..

ప్రజల్లో నటించేకంటే తెరపైనే మంచిది..

ఫిలిం ఇండస్ట్రీలోకి పవన్ రీఎంట్రీని టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం స్వాగతించారు. ప్రజల్లో ఉంటూ రోజూ నటిస్తే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందని, సినిమాల్లో నటిస్తూ పార్టీని నడుపుకోవాలన్న పవన్ ఆలోచనలో తప్పులేదని అన్నారు. గతంలో ఏపీలో ఎన్డీఆర్, తమిళనాడులో ఎంజీఆర్ లాంటి పాపులర్ హీరోలు కూడా పాలిటిక్స్ లో ఉంటూనే సినిమాలుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

జనసైనికుల్లో జోష్

జనసైనికుల్లో జోష్

రాష్ట్ర ప్రజలకు అండగా పార్టీని నడిపే విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండబోదని మొదటి నుంచీ చెబుతోన్న పవన్ కల్యాణ్.. ఆర్థిక అవసరాల కోసం మాత్రమే సినిమాల్లోకి తిరిగొస్తున్నట్లు వివరించారు. అయితే ఆయన రీఎంట్రీపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా క్రమక్రమంగా అన్ని పార్టీలూ పాజిటివ్ గా స్పందిస్తుండటంతో జనసైనికుల్లో జోష్ పెరిగింది.

English summary
when cbi ex jd laxminarayana strongly opposed pawan kalyan re entry in to movies, Including lok satta chief jayaprakash narayan, tdp, bjp leaders also welcomes jana sena chief pawan kalyans decision of making movies agin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X