అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని భూలావాదేవీలపై సీఐడీ విచారణ!! తేలాకే అమరావతిపై ముందుకు: రికార్డుల పరిశీలన..ఆరా..!

|
Google Oneindia TeluguNews

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా.. రాజధాని వ్యవహారంలో జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక తరలిస్తారా అనే విధంగా అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. ఆ చర్చలు ముగిసినా..అక్కడ పెద్ద ఎత్తున భూ స్కాం జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. దీని మీద ప్రభుత్వం వాస్తవాలు బయట కు తీసే పక్రియ ప్రారంభించింది. ఇందు కోసం తొలుత సీబీఐ విచారణ వైపు ఆలోచన చేసినా..రాజధాని భవిష్యత్ ను పరిగణలోకి తీసుకొని ఆ విచారణ బాధ్యతలను సీఐడీకీ అప్పగించినట్లు తెలుస్తోంది.

దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి అక్కడ జరిగిన భూ క్రయ విక్రయాల పైన రికార్డుల పరిశీలన..రైతుల ఆరా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజధానితో సమా రాష్ట్రంలో నగరాల డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత రాజధాని పైన నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సీఐడీ విచారణ కోసమే ప్రభుత్వం నిరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో.. ఈ నివేదిక వచ్చిన తరువాతనే ప్రభుత్వం అమరావతి పైన ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

బాలయ్య టార్గెట్ గా రాయలసీమపై ఫోకస్ పెట్టిన జగన్ ... టీడీపీలో టెన్షన్

రాజధానిలో భూ వ్యవహారాలపై సీఐడీ ఫోకస్...

రాజధానిలో భూ వ్యవహారాలపై సీఐడీ ఫోకస్...

తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధానిలో భారీగా భూ స్కాం జరిగిందని..ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారాల పైన తొలుత రెవిన్యూ విభాగం తో విచారణ చేయిస్తున్నా..మరింత పక్కగా సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సీఐడీనీ రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే.. సీఐడీ అధికారులు అమరావతిలో జరిగిన భూముల లావాదేవీలపై సీఐడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో భూములు అమ్మిన రైతులతో మాట్లాడారు. బృందాలుగా ఏర్పడి వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు, నేలపాడు గ్రామాల్లో ఆరా తీస్తున్నారు. రాజధానిలో జరీబు మెట్ట భూముల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి.. ఎంతమంది బయటి నుంచి వచ్చి కొనుగోలు చేశారనే దానిపై ఆయన్నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. లంక భూముల కొనుగోళ్లపైనా సీఐడీ అధికారులు దృష్టిపెట్టినట్లు సమాచారం. లంక భూములను అమ్మినవారి నుంచి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.

భూముల గోల్ మాల్ తేలాకే...

భూముల గోల్ మాల్ తేలాకే...

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న అధికార పార్టీ అక్కడ విచారణ పూర్తయిన తరువాతనే అమరావతి విషయంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే ముందు గా అక్కడి పరిస్థితులు..అక్రమాల పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. దీని ద్వారా అమరావతిలో అవినీతి జరిగిందని..దీని కారణంగానే తాము విచారణ చేయిస్తున్నామని చెప్పుకోవటం కోసమే బొత్సా వ్యాఖ్యలు చేసినట్లుగా అర్దం అవుతోంది.

అయితే..రాజధాని తరలింపు ఆలోచన ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి లేకపోయినా..అక్కడ భూ కుంభకోణం విషయంలో పాత్ర ధారులు..సూత్ర ధారులను మాత్రం వదలకూడదనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాము అవినీతి చేసి ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సవాళ్లు వస్తున్న సమయంలో వాటిని రుజువు చేయటం ఇప్పుడు ప్రభుత్వ సమర్ధతకు పరీక్ష గా మారుతోంది. దీంతో..సీఐడీని రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది.

కమిటీ పేరుతో మరొ కొంత కాలం..

కమిటీ పేరుతో మరొ కొంత కాలం..

దే సమయంలో రాజధానితో సమా రాష్ట్రంలో నగరాల డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. తొలుత ఆరు వారాల్లో ప్రభుత్వం కోరిన విధంగా సూచనలు..సలహాలు కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించిన ప్రభుత్వం..ఇప్పుడు వారికి విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూముల వ్యవహారంలో జరుగుతున్న విచారణ పూర్తి చేయటానికి మరింత సమయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..ఒక వైపు విచారణ కొనసాగిస్తూనే..తాము నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేస్తోంది. అయితే..కమిటీ నివేదిక కంటే సీఐడీ అధికారులు తమ పరిశీలనలో తేల్చిన అంశాల ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

English summary
As per sources AP govt ordered CID investigation on capital land scam. Ruling pary leaders allegating insider trading taken place in TDP tenure. Aftet this investigation only govt may move forward in Amaravti issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X