బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం ఏపీ-ఒడిశా తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరుల్లో వర్షం పడుతోంది. ఇదే పరిస్థితి కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తోంది. అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తోన్నారు. ఒడిశాలోని గజపతి, కటక్, భువనేశ్వర్, పూరీ జిల్లాలపై అసానీ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. తుపాన్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకోసం..
Newest FirstOldest First
5:39 PM, 12 May
ఏపీలో కొనసాగుతోన్న వర్షాలు
2:11 PM, 12 May
ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh| Cyclone 'Asani' lashes parts of Andhra, crops destroyed in Eleru pic.twitter.com/rbzHqHvJUE
అసని తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికి అందిన పంట నీటి పాలైంది.
12:24 PM, 12 May
అసని తుఫాన్ బలహీనపడినప్పటికీ కొనసాగుతున్న దాని తీవ్రత. కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మధ్యాహ్నం తరువాత కూడా పడుతున్న వర్షం.
12:02 PM, 12 May
ఆంధ్రప్రదేశ్
రుతు పవనాలు ప్రవేశించడానికి ముందే ఏపీలో భారీ వర్షాలకు కారణమైన అసని తుఫాన్. 1960 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు మాత్రమే ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ ఏపీపై ప్రభావాన్ని చూపాయి.
11:24 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
మరింత బలహీనపడ్డ అసని తుఫాన్. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా కదులుతున్నట్లు వెల్లడించిన వాతావరణ కేంద్రం. ఈ మూడు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఇంకొన్ని గంటల పాటు వర్షం పడుతుందని అంచనా
10:50 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh | Kakinada -Uppada Beach Road damaged due to strong winds and heavy rains as an impact of cyclone Asani
The movement of vehicular traffic is affected as the road is damaged; restoration work to be started soon, say police. pic.twitter.com/LtoKPzP0GT
అసని తుఫాన్ ప్రభావానికి కాకినాడ-ఉప్పాడ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఫలితంగా వాహనాల రాకపోకలను నిలిపివేత. త్వరలోనే మరమ్మతు పనులు చేపడతామని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వివరించిన పోలీసులు.
8:30 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
Deep Depression over coastal Andhra Pradesh remained practically stationary during last 6 hrs & weakened into a Depression over the same region. It is likely to hover around the same region & weaken further into a well marked low pressure area during next 12 hrs: IMD
కోస్తా తీరంపై తీవ్ర అల్పపీడనం గత ఆరు గంటలుగా స్థిరంగా ఉంది. అక్కడే అది బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 12 గంటల సమయంలో మరింత బలహీనపడుతుందని పేర్కొంది.
7:44 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
అసని తుఫాన్ బలహీనపడిన తరువాత కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్ష తీవ్రత తగ్గట్లేదు.
7:29 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలను చేపట్టిన జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు.
6:24 AM, 12 May
ఆంధ్రప్రదేశ్
కృత్తివెన్ను వద్ద తీరాన్ని తాకిన తరువాత బలహీనపడ్డ అసని తుఫాన్. ఆరు గంటల వరకు దాని ప్రభావం ఉంటుందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వెల్లడి
11:24 PM, 11 May
మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
11:23 PM, 11 May
ఏపీకి తుఫాను పెనుముప్పు తప్పినట్లే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. ఇక్కడ భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు.
10:30 PM, 11 May
అసని తుఫాన్ నిన్నటి తో పోలిస్తే ఇవాళ కాస్త నెమ్మదించింది. గంటకు కేవలం 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కాకినాడ నుంచి బాపట్ల వరకూ వచ్చింది. అక్కడి నుంచి తిరిగి బందరు వైపుకు మళ్లింది. ఆ మధ్యలోనే తీరాన్ని తాకింది
9:03 PM, 11 May
ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది తుఫాను.
9:02 PM, 11 May
నెమ్మదిగా కదులుతున్న అసని తుపాను.
8:06 PM, 11 May
తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులోకి సందర్శకులు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ పెట్టారు.
8:05 PM, 11 May
అసని తుపాను ధాటికి కాకినాడ-ఉప్పాడ బీచ్ రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
8:03 PM, 11 May
అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
6:43 PM, 11 May
Manyam, Andhra Pradesh | Cyclone Asani turmoil- Uprooted trees block highway in Andhra's Manyam pic.twitter.com/1mREZKX90S
తీవ్ర తుపాను దృష్ట్యా అప్రమత్తమైన వివిధ శాఖల సిబ్బంది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సిద్ధం
4:50 PM, 11 May
తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లులోతట్టు ప్రాంతాల్లో తుపాను సమాచారాన్ని మైకుల ద్వారా తెలియజేస్తున్న సిబ్బంది
3:02 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు నిధులను మంజూరు చేశామని, పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదంటూ వైఎస్ జగన్ ఆదేశం. సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా అందుబాటులోకి తీసుకుని హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని, బాధితులను ఆదుకోవాలంటూ సూచన
2:55 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
అసని తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. పునరావాస శిబిరాలకు తరలించిన వారికి 2,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశం. పునరావాస శిబిరాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచన
2:05 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
కొన్ని గంటల్లో కొనసీమ అంతర్వేది వద్ద అసని తుఫాన్ తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. మళ్లీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుంటుందని పేర్కొన్న డైరెక్టర్
1:50 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం మచిలీపట్నానికి 40, కాకినాడకు 140 , విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అసాని తుఫాన్. ఆరు గంటల వ్యవధిలో ఆరు కి.మీ వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలినట్లు వెల్లడించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద
1:21 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
అసని తుఫాను ప్రభావంతో కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలుల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. పొంగిపొర్లుతున్న కాలువలు. రోడ్ల పైకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
12:46 PM, 11 May
ఆంధ్రప్రదేశ్
Manyam, Andhra Pradesh | Cyclone Asani turmoil- Uprooted trees block highway in Andhra's Manyam pic.twitter.com/1mREZKX90S
అసాని తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం వద్ద అల్లకల్లోలంగా మారిన సముద్రం
10:42 AM, 10 May
ఆంధ్రప్రదేశ్
అసాని తుఫాన్ ప్రభావం ఏపీపై అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తోన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తోన్నారు.
10:44 AM, 10 May
ఆంధ్రప్రదేశ్
Severe cyclonic storm Asani is over west-central region & adjoining southwest region of Bay of Bengal. It is 330 km south-southeast of Visakhapatnam Likely to move further northwest till tonight, thereafter it'll recurve: Kumar, Duty Officer, Cyclone Warning Center Visakhapatnam pic.twitter.com/w8ovoiSBin
అసాని తుఫాన్ విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ కుమార్ తెలిపారు.
10:56 AM, 10 May
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
11:09 AM, 10 May
అసని తుపాను కారణంగా చెన్నై నుంచి హైదరాబాదు, విశాఖపట్నం, జైపూర్,ముంబైలకు విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నిర్ణయం
12:02 PM, 10 May
విశాఖపట్నంకు దక్షిణాప 300 కిలోమీటర్ల దూరంలో అసని తుపాను కేంద్రీకృతమై ఉంది. ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రిలీఫ్ ఆపరేషన్స్‌కు సిద్ధంగా ఉన్నాయి
12:02 PM, 10 May
ఒడిషా
ఈ రోజు రేపు గంజాంలో ఉన్న అన్ని బీచ్‌లను మూసేవేస్తున్నట్లు ప్రకటించిన గంజా మున్సిపల్ యంత్రాంగం
12:57 PM, 10 May
దిశమార్చుకున్న అసని తుపాను.. మచిలీపట్నం విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
1:51 PM, 10 May
Cyclone asaani upgraded to VERY SEVERE ONE. Entire TN covered by clouds. 12:30- 1am today we had devastating winds and rains, made a significant damages in our village. Certainly I would say it was 70-90kmph. asani giving lot surprises. pic.twitter.com/id0AWHWiGP
— Latent heat(வானிலை ஆர்வலர்) (@chennai13621472) May 10, 2022
— IIMC Dhenkanal EJA 22 (@IIMCDklEjA) May 10, 2022
చెన్నైలో అసని ప్రభావం.. నగరంలో వర్షాలు
2:03 PM, 10 May
విశాఖలో తుఫాన్ ఎఫెక్ట్. నగరంలో భారీ వర్షం. వర్షానికి జలమయం అవుతున్న రహదారులు
3:00 PM, 10 May
అసని తుఫాన్ దూసుకొస్తున్న తరుణంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన హోంమంత్రి తానేటి వనిత.
3:34 PM, 10 May
విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న హోంమంత్రి
3:34 PM, 10 May
సహాయక చర్యల్లో భాగంగా SDRF, NDRF బృందాలను సిద్ధం చేసినట్లు హోంమంత్రి కి తెలిపిన డైరెక్టర్ అంబేద్కర్.
4:49 PM, 10 May
దిశ మార్చుకున్న 'అసని' తుఫాన్, రేపు సాయంత్రంలోగా తీరం దాటే అవకాం, మచిలీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటే సూచనలు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
5:30 PM, 10 May
అసని ఎఫెక్ట్ :గుంటూరు,కృష్ణా, తూర్పు,పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్
5:31 PM, 10 May
తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక
6:12 PM, 10 May
ఈ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం వరకూ భారీ నుండి అతి భారీ వర్షాలు
6:13 PM, 10 May
48 నుండి 63 కి.మీ వేగంతో గాలులు
6:37 PM, 10 May
48 నుండి 63 కి.మీ వేగంతో గాలులు.తీవ్ర సైక్లోన్‌గా మారిన అసాని
7:08 PM, 10 May
Asani is moving towards the Andhra coast. A red alert has been issued for Andhra. It is expected to reach the west-central Bay of Bengal close to Kakinada or Vishakhapatnam by morning: Sanjeev Dwivedi, Scientist IMD on #cycloneasanipic.twitter.com/erdOMD2Oan
అసని ఆంధ్రా తీరం వైపు కదులుతోంది. ఆంధ్రాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం నాటికి కాకినాడ లేదా విశాఖపట్నం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సంజీవ్ ద్వివేది తెలిపారు.
8:13 PM, 10 May
విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
9:08 PM, 10 May
తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది.
9:49 PM, 10 May
Cyclone 'Asani' to hit Kakinada coast, says Visakhapatnam cyclone warning centre
తుఫాను అసని ప్రభావంతో విశాఖపట్నంలో కురుస్తున్న వర్షాలు.
12:19 AM, 11 May
తుఫాను అసని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా చూపిస్తోంది. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
12:19 AM, 11 May
సముద్రపు అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలు, మత్స్యకారులకు వాతావరణశాఖ, ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది.
8:42 AM, 11 May
కడప ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
9:00 AM, 11 May
శ్రీకాకుళం సముద్రంలో కొట్టుకువచ్చిన బంగారు వర్ణపు రథం
9:07 AM, 11 May
ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh | Traffic movement on Kakinada - Uppada Beach Road closed in wake of #CycloneAsani
Police say, "Pitch road is damaged, we put up 2 check-posts in our limits to control vehicular movement. Roads are getting damaged. We're stopping everybody from taking this route" pic.twitter.com/yiDcayPikx
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత. రోడ్డు ధ్వంసం. వాహనాల రాకపోకలను నివారించడానికి రెండు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు