వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు పెడితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్: అశోక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashok Babu
కాకినాడ: రాజ్యాంగంలో ఏముందో కూడా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తెలియదని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు. కాకినాడలో మంగళవారం జరిగిన సమైక్యాంధ్ర సభలో ఆయన ప్రసంగించారు. అపోహల ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తే సహించబోమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఏ రకంగా విడిదీస్తారని అడిగితే ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పలేని స్థితి ఉందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే హైదరాబాదులో పది లక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అశోక్ బాబు హెచ్చరించారు.

విభజన జరగకుండా 2014 దాకా తాము జీవితాలను ఫణంగా పెడుతామని, ఆ తర్వాత బాధ్యత రాజకీయ నాయకులదేనని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు మంచి అభ్యర్థులను పార్టీలకు అతీతంగా సమర్థించాలని ఆయన సూచించారు. తాము రాజకీయ పదవులను ఆశించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కడదాకా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప తమకు మరో ఆలోచన లేదని ఆయన చెప్పారు. డబ్బుతో ఓట్లను కొంటామని కొందరు నేతలు చెబుతున్నారని అంటూ ప్రజలను చులకనగా చూసే నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. నాయకులకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోేత వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తామని అశోక్ బాబు చెప్పారు.

ఓటు నిజాయితీగా వేయాలని, ఎవరికి ఓటు వేయాలో సమయం వచ్చినప్పుడు తాము చెబుతామని అన్నారు. పార్టీని చూసి ఓటేస్తే ఆ తర్వాత పార్టీని మరో పార్టీలో కలిపే అవకాశం ఉందని, వ్యక్తులను చూసి ఓటేయాలని, మీ ప్రాంతంలో మంచి నాయకుడు ఉంటే పార్టీతో సంబంధం లేకుండా సమర్థించాలని ఆయన అన్నారు.

సీమాంధ్ర నాయకులు రెండు నాల్కల ధోరణిని సహించబోమని హెచ్చరించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశఆరు. వర్షంలో తడిసి, ఎండలో ఎండి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఐదు కోట్ల ప్రజల అభిమానానికి తాము అమ్ముడుపోయామని అన్నారు. శాసనసభలో విభజన తీర్మానాన్ని సీమాంధ్ర శాసనసభ్యులు ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఈ నెల 23వ తేదీన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, 24వ తేదీన భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించాలని ఎపి ఎన్జీవోల సంఘం నిర్ణయించింది. 25వ తేదీన బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. 27వ తేదీన జాతీయ రహదారులను దిగ్భంధించాలని నిర్ణయించారు.

English summary
AP NGOs assocation president P ashok Babu lashed out at Congress AP affairs incharge Digvijay Singh and home minister Sushil kumar Shinde on the bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X