వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాళీచేయిస్తే ఖబర్దార్: అశోక్‌బాబు, సుప్రీంకు: కృష్ణంరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ashok Babu warns over vacating students
హైదరాబాద్: విద్యార్థులను హాస్టల్స్ నుండి ఖాళీ చేయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు శుక్రవారం హెచ్చరించారు. అనంతపురంలో హాస్టల్స్ నుండి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారనే అంశంపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి నుడి తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాత తాము ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. తాము ఎటువంటి సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

విభజన విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. ఈ నెల 9వ తేదిన సమైక్య ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశమై ఆందోళన కార్యక్రమాలను రూపొందిస్తామన్నరు. రాజకీయ పార్టీలు జెండాలను పక్కన పెట్టి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, ఆ బాధ్యత వారి పైన ఉందన్నారు.

సిక్సర్ కొడతానన్న సిఎం రద్దు చేయాలి: సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిక్సర్ కొడతానని చెప్పారని, ఇప్పటికైనా ఆయన అసెంబ్లీని రద్దు చేసి విభజనను అడ్డుకోవాలని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సూచించారు. అసెంబ్లీలో, పార్లమెంటులో విభజన బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైనే ఉందన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.

సుప్రీం కోర్టుకు: రఘురామ కృష్ణం రాజు

రెండుమూడు రోజుల్లో తాము మరోసారి విభజన అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఆచరణ సాధ్యం కాని ఎన్నో ప్రతిపాదనలు డ్రాఫ్ట్ బిల్లులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెసు పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తెల్లం బాలరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్లాంక్ చెక్ ఇచ్చారని ఆరోపించారు. కేబినెట్ విభజనకు ఆమోదం తెలపడం బ్లాక్ డే అన్నారు.

బిల్లు పెట్టకుంటే: నారాయణ

కాంగ్రెసు పార్టీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింప చేయకుండే కొట్టుకుపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కోస్తాంధ్రలో ఆందోళనలు వస్తాయని ముందునుంచి చెబుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.

English summary
APNGO's chief Ashok Babu on Friday warned Seemandhra universities over vacating students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X