వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశోక్ బాబు గెలుపు: జగన్‌కు ఆరడుగుల బుల్లెట్ షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Ashok Babu wins in APNGOs elections
హైదరాబాద్: ఎపిఎన్జీవో అధ్యక్షుడిగా అశోక్ బాబు ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎపిఎన్జీవో ఎన్నికల్లో అశోక్ బాబుకు 630 ఓట్లు రాగా, ప్రత్యర్థి బషీర్‌కు 174 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోని ఆయన ప్యానల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల్లో ఆరడుగుల బుల్లెట్టు దూసుకుపోయింది. అశోక్ బాబు 'జై సమైక్యాంధ్ర' అని నినదిస్తే ఉద్యోగులు 'జై అశోక్ బాబు' అని మద్దతునిచ్చారు. ఉద్యోగుల్లోనే కాకుండా రాజకీయ నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఎపిఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా పదిహేడు పదవులకు మొత్తం పదిహేడు పదవులను అశోక్ బాబు వర్గీయులే గెలుచుకున్నారు. అశోక్ బాబు ప్యానల్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన బషీర్ ప్యానల్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అశోక్ బాబు ప్యానల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు 80 నుంచి 90 శాతం మేరకు ఓట్లు రాగా బషీర్ ప్యానల్‌కు 10 నుంచి 20 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.

ఎపిఎన్జీవో సంఘంలో మొత్తం ఓట్లు 847 ఉన్నాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 815 పోలయ్యాయి. వీటిలో 13 ఓట్లు చెల్లలేదు. కౌంటింగ్ ముగిసే సరికి అశోక్ బాబు ప్యానల్‌కు 630 ఓట్లు రాగా.. బషీర్ ప్యానల్‌కు 174 ఓట్లు మాత్రమే దక్కాయి. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే అశోక్ బాబు ప్యానల్ విజయం ఖాయమైపోయింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన అశోక్ బాబు 456 ఓట్ల ఆధిక్యంతోనూ, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చంద్రశేఖర రెడ్డి 425 ఓట్ల ఆధిక్యంతోనూ ఘన విజయం సాధించారు.

న్యాయం గెలిచింది: అశోక్‌బాబు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మా ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, సంఘం ఎన్నికల సందర్భంగా జరిగిన పలు సంఘటనలను తాము గమనించామని, తమ ఉద్యోగులపై మానసికంగా, సామాజికంగా తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తమ ప్యానల్ విజయం సాధించిందని అశోక్ బాబు అన్నారు. న్యాయం, ధర్మం తమవైపు ఉండడమే తమ విజయానికి కారణమన్నారు. ఎన్నికల ఫలితాలను గౌరవంగా స్వీకరిస్తున్నానని బషీర్ అన్నారు.

జగన్‌కు షాక్

అశోక్ బాబు ఎన్నిక జగన్‌కు షాకిచ్చినట్లయిందంటున్నారు. అశోక్ బాబు ప్యానల్ పైన పోటీ చేసిన ప్రత్యర్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎపిఎన్జీవో, అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోయారు. ఈ నేపథ్యంలో అశోక్ బాబుకు చెక్ చెప్పి ఎపిఎన్జీవో సమైక్య ఉద్యమాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకే జగన్ బషీర్ ప్యానల్‌ను ఉపయోగించుకున్నారంటున్నారు. అయితే, అశోక్ గెలుపు ద్వారా జగన్‌కు షాక్ తగిలినట్లయిందంటున్నారు.

English summary

 Employees leader Ashok Babu was elected president of the APNGOs with thumping majority on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X