• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌గ‌న్ ప్రభుత్వానికి మ‌రో బ్యాంకు షాక్‌: అమ‌రావ‌తి కోసం నిధులు ఇవ్వ‌లేం: తేల్చేసిన ఏఐఐబీ...!

|

ఏపీ రాజ‌ధానికి ప్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దు నిర్ణ‌యం మ‌ర‌వ‌క ముందే మ‌రో బ్యాంకు షాక్ ఇచ్చింది. అమరావ‌తి ప్రాజెక్ట కోసం 200 మిలియ‌న్ డాల‌ర్ల రుణం ఇవ్వ‌లేమ‌ని ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ తేల్చి చె ప్పింది.అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డార్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న విర‌మించుకోవ‌టంతో తాము సైతం నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా ప్ర‌పంచ బ్యాంకు స్ప‌ష్టం చేసింది. అయితే, ఇప్పుడు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ సైతం అదే బాట‌లో నిర్ణ‌యం తీసుకోవ‌టంతో ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

 మ‌రో బ్యాంకు షాక్‌..

మ‌రో బ్యాంకు షాక్‌..

ప్ర‌పంచ బ్యాంకు త‌ర‌హాలోనే రాజ‌ధానికి నిధుల విష‌యంలో మ‌రో బ్యాంకు షాకిచ్చింది. అమ‌రావ‌తికి రెండు వంద‌ల మిలియ‌న్ డాల‌ర్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన ఈ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ కొద్ది సేప‌టి క్రితం త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. చైనా ఆధిప‌త్యంతో ఈ బ్యాంకు నిర్వ‌హ‌ణ సాగుతోంది. అయితే, కొద్ది రోజుల క్రితం ప్ర‌పంచ బ్యాంకు అమ‌రావ‌తి అభివృద్ది కోసం నిధుల మంజూరు కోసం ముందుకు వ‌చ్చినా ఎదురైన ప‌రిణామాల‌తో వెన‌క్కు తగ్గింది. రాజ‌ధాని మీద ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని..దీని పైన క్షేత్ర స్థాయి విచార‌ణ కోసం వ‌స్తామ ని ప్ర‌పంచ బ్యాంకు కోర‌గా..కేంద్రం తిరస్క‌రించింది. విదేశీ బ్యాంకులు మ‌న రాజ‌ధానుల మీద వ‌చ్చిన ఫిర్యాదుల పైన విచార‌ణ చేయ‌టానికి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది. దీంతో..అమ‌రావ‌తికి ఇచ్చే రుణం ఉప‌సంహ‌రిం చుకున్నా..ఏపీ నూత‌న ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌న కార్య‌క్ర‌మాల‌ను రుణం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అయినా ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ర‌గ‌డ‌కు కార‌ణ‌మైంది.

జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌కు న‌ష్ట‌మేనా..

జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌కు న‌ష్ట‌మేనా..

ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకు రుణం ద‌క్క‌క‌పోవ‌టం పైన ఇది కొత్త సీఎం జ‌గ‌న్ వైఫ‌ల్య‌మ‌నే ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తాయి. ప్ర‌పంచ బ్యాంకుకు నాటి ప్ర‌భుత్వం మీద ఫిర్యాదులు చేయించిందీ..రుణం రాకుండా అడ్డుకుంది వైసీపీ అంటూ టీడీపీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌పంచ బ్యాంకు నేరుగా కేంద్రానికి త‌మ కు వ‌చ్చిన పిర్యాదుల గురించి వివ‌రించింది. క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుల గురించి అనుమ‌తి కోరింది. ఆ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు చేయ‌గా..త‌మ అభిప్రాయం చెప్ప‌టానికి నెల రోజుల స‌మయం కావాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విజ్క్ష‌ప్తి చేసింది. అదే స‌మ‌యంలో కేంద్రం మీద మ‌రో సారి ప్ర‌పంచ బ్యాంకు ఒత్తిడి తేవటం తో కేంద్రం క్షేత్ర స్థాయికి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్ప‌టంతో..ప్ర‌పంచ బ్యాంకు రుణం తిర‌స్క‌రించింది. దీని పైన అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

ఇప్పుడు ఈ నిర్ణ‌యంతో మ‌రోసారి..

ఇప్పుడు ఈ నిర్ణ‌యంతో మ‌రోసారి..

ఇక‌..ఇప్పుడు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ సైతం అదే త‌ర‌హాలో రెండు వంద‌ల బిలియ‌న్ డాల‌ర్ల సాయం నిలిపివేయ‌టం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇబ్బంది కానుంది. రాజ‌ధానిలో ప‌నులు నిలిపివేసార‌ని..భూముల ధ‌ర‌లు ప‌డిపోయాయ‌ని..కూలీలు ఉపాధి కోల్పోయారంటూ టీడీపీ చాలా రోజులుగా ఆరోప‌ణ‌లు చేస్తోంది. అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వంలో రాజ‌ధాని అంశంలో చోటు చేసుకున్న అవినీతిని వెలికి తీస్తామంటూ క‌మిటీని ఏర్పాటు చేసారు. దీంతో..అస‌లు రాజ‌ధాని విష‌యంలో ఏం జ‌రుగుతుందో అర్దం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాము రాజ‌ధాని నిలిపివేస్తామ ని ఎప్పుడూ చెప్ప‌లేద‌ని ప్ర‌భుత్వం వాదిస్తున్నా..వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు మాత్రం జ‌గ‌న్ కు ఇబ్బందిగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
Asian Infrastructure Investments Bank rejected Loan for development of Amaravati. Recently World Bank back step in loan issue. Now AIBB also going in same path.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X