వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఒక్కరోజే అసెంబ్లీ: మండలి రద్దుపైన తీర్మానం..చర్చ: కేంద్రానికి సిఫార్సు..బీఏసీలో నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ ఒక్క రోజే నిర్వహించాలని నిర్ణయం జరిగింది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో కాసేపట్లో ప్రవేశ పెట్టనుండి .దీని పైన చర్చ చేసిన తరువాత ఏపీ మండలిని రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ సభ తీర్మానం ఆమోదంచ నుంది. అయితే, సభ నిర్వహణ..

మండలి రద్దు తీర్మానం పైన చర్చ ఖరారు కోసం శాసనసభా బీఏసీ సమావేశం జరిగింది. ఇందులో దీని పైన చర్చ ఏ రకంగా నిర్వహించాలనే దాని పైన చర్చించారు. తొలుత ఈ నెల 20న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను 22వ తేదీ వరకే నిర్వహించాలని 20న జరిగిన బీఏసీలో నిర్ణయించారు. అయితే, 23వ తేదీ సైతం సభ కొనసాగింది. ఇప్పుడు మరోసారి సమావేశమైంది. దీని పైన టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు బీఏసీ సమావేశం పైన సమాచారం ఇచ్చినా..టీడీపీ సమావేశానికి గైర్హాజరైంది.

esolution on Abolish of council

ఏపీ కేబినెట్ సమావేశంలో మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు తదుపరి ప్రక్రియ మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా..శాసనసభలో ఈ మేరకు మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ తీర్మానం పైన సభలో చర్చించి..కేంద్రానికి మండలి రద్దు పైన సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించనున్నారు.

అయితే, సమావేశాల పొడిగింపు.. తీర్మానం ప్రతిపాదన..చర్చ వంటి అంశాల పైన బీఏసీ ఆమోదం కోసం ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. రాజ్యంగ విరుద్దంగా మండలి రద్దు పైన చర్చల్లో తాము పొల్గొనమని.. శాసనసభకు గైర్హాజరు కావాలని టీడీపీ నిర్ణయించింది. అదే విధంగా.. బీఏసీ మీద టీడీపీకి సమాచారం పంపామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu

కానీ, టీడీపీ బీఏసీ సమావేశానికి గైర్హాజరు అయింది. ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు బుగ్గన..కన్నబాబు.. చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ ఫిర్యాదు పైనా చర్చించారు. ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వ తీర్మానం పైన చర్చ ఉంటుందని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేసారు. ఇక, ఈ సమావేశంలో ప్రభుత్వం సమావేశాల నిర్వహణ.. తీర్మానం పైన చర్చ చేపట్టాలని తీర్మానించారు.

English summary
AP Assembly BAC decided to conduct assembly for to day only. Agreed for discussion on council abolish resolution. TDp absent for Assembly and also for BAC meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X