వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందీ రాష్ట్రాల్లో తెలుగుభాష: చంద్రబాబు, ఎమ్మెల్యేలకు 'ఇంగ్లీష్' చురకలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: హిందీ రాష్ట్రాల్లో మూడో భాషగా తెలుగును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో తెలుగు భాష బోధనలు రద్దు చేసి చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు.

ఆయా రాష్ట్రాలతో మాట్లాడి రెండో అధికార భాషగా తెలుగు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఆయన అసెంబ్లీలో తెలుగు భాషపై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక, గ్రామీణ సాంకేతిక, జానపద, చరిత్రకు సంబంధించి ఆరు ఆకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు.

మరో వికెట్, జగన్‌కు గుర్నాథ్‌రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీమరో వికెట్, జగన్‌కు గుర్నాథ్‌రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ

అమరావతికి తీసుకు వచ్చేందుకు సంప్రదింపులు

అమరావతికి తీసుకు వచ్చేందుకు సంప్రదింపులు

ఏపీ నృత్య, సంగీత, నాటక, జానపద అకాడమీలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. మైసూరుకు తరలించాలనుకున్న ప్రాచీన భాషా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని చంద్రబాబు తెలిపారు. న్యాయపాలనలో తెలుగు అమలు కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతామని, తీర్పులు తెలుగులో వెలువరించేలా చూస్తామని చెప్పారు.

తెలుగు మహాసభలు

తెలుగు మహాసభలు

ప్రతి రెండేళ్లకు ఓసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న కమిటీ సూచనలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఏపీలో ఉండే ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగు నేర్చుకునేలా తెలుగు సబ్జెక్టును ప్రవేశపెట్టించే చర్యలు చేపడతామని చంద్రబాబు చెప్పారు.

ఎమ్మెల్యేలు తెలుగు గురించి మాట్లాడినా

ఎమ్మెల్యేలు తెలుగు గురించి మాట్లాడినా

మున్సిపల్‌ స్కూళ్లలో సైతం తెలుగు ఉండాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక్కడ సభ్యులు ఎన్ని మాట్లాడినా పిల్లలు, మనవళ్లను ఇంగ్లీష్ మీడియాం వైపు మళ్లిస్తున్నారని చురకలు అంటించారు. చివరకు కూలీలు సైతం పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నారు. ఇప్పటి నుంచే అసెంబ్లీ నుంచే తెలుగు పరిరక్షణకు ప్రాధాన్యం ఇద్దామన్నారు. తెలుగు పరిరక్షణ, అభివృద్ధికి ప్రపంచంలోని తెలుగువారంతా సహకరించాలన్నారు. కోరారు.

 పార్టీలోనే తెలుగు

పార్టీలోనే తెలుగు

తెలుగుదేశం పార్టీ పేరులోనే తెలుగు ఉందని, మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తెలుగు భాషపై ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ బుధవారం సావధాన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu said the Legislative Assembly could take the lead in propagating Telugu by making all correspondences in the native language while the government implemented the recommendations of a six-member committee that was headed by former Minister of Culture, Palle Raghunatha Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X