మహిళలకు నెలకు రూ 1500 - ముహూర్తం ఫిక్స్, ప్రభుత్వం కీలక నిర్ణయం..!?
Assembly Sessions: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనకు సిద్దం అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనవి అమల్లోకి తెచ్చారు. పెండింగ్ వాటి విషయంలోనూ కసరత్తు జరుగుతోంది. ముమూర్తం ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ రాజకీయంగా.. పాలనా పరంగా కీలకం కానుంది.
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశ అజెండా.. పని దినాల పైన నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావటంతో 14వ తేదీ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తో పాటుగా ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. 18 నుంచి 21 పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ సమావేశాల పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

కేటాయింపులపై కసరత్తు
కాగా, ఈ బడ్జెట్ లో అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి కి సమ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా చెప్పిన సూపర్ సిక్స్ లో నాలుగు పథకాలు అమలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో ఆడబిడ్డ నిధి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది. దీంతో.. ఈ సారి బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన మహిళలందరికీ రూ. ప్రతి నెల 1,500 ఇచ్చేలా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా మహిళలకు పూర్తిగా బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం మరింతగా వారికి దగ్గరవ్వటంతో పాటుగా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అదే విధంగా అమరావతి, పోలవరం సహా... సంక్షేమ రంగాలకు నిధుల్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలనా పరంగా రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో ఏట అడుగు పెడుతున్న వేళ ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వం కీలకంగా మారుతోంది. కాగా.. ఈ సమావేశాల్లో తొలి రోజున జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. మిగిలిన రోజులు సభకు వచ్చే విషయంలో వైసీపీ సభ్యుల నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications