వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలు బీహార్ కంటే అధ్వాన్నం! అక్షరాస్యతలో ఏపీ అధమ స్థానం, తెలంగాణ పర్లేదు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ అక్షరాస్యత రేటులో ఇప్పటి వరకు మెరుగైన స్థానాల్లో ఉన్న పలు రాష్ట్రాలు వెనకబడిపోయాయి. ఇంతకుముందు వెనుకబడిన కొన్ని రాష్ట్రాలు అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చాయి. ఇక దక్షిణాదిలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరూ ఊహించని విధంగా టాప్-10లో కూడా లేకపోవడం గమనార్హం.

బీహార్ కంటే దారుణం.. అట్టడుగున ఏపీ..

బీహార్ కంటే దారుణం.. అట్టడుగున ఏపీ..

అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కంటే వెనుకబడి ఉండటం శోచనీయం. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 66.4 శాతంగా ఉండటం గమనార్హం. బీహార్ రాష్ట్రం ఏపీ కంటే మిన్నగా 70.9శాతంగా ఉండటం విశేషం. బీహార్ రాష్ట్రం ఎప్పుడూ అక్షరాస్యతలో అట్టుడుగు స్థానం ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం బాగా మెరుగుపడింది.

తెలంగాణ కాస్త మెరుగే కానీ..

తెలంగాణ కాస్త మెరుగే కానీ..

ఇక మరో తెలుగు రాష్ట్రం బీహార్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. తెలంగాణలో అక్షరాస్యత 72.8 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 77.7శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం 85.9 శాతం అక్షరాస్యతను సాధించింది. కర్ణాటకలో 77.2శాతం అక్షరాస్యత నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 87.6 87.6శాతం అక్షరాస్యత ఉంది.

కేరళ ఫస్ట్.. ఢిల్లీ సెకండ్..

కేరళ ఫస్ట్.. ఢిల్లీ సెకండ్..

ఇక అక్షరాస్యత కేరళ మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విద్యా నివేదికను విడుదల చేసింది. కాగా, ఏపీ, తెలంగాణ లాంటి అభివృద్ది చెందిన రాష్ట్రాల్లోనే అక్షరాస్యత తక్కువగా నమోదవడం గమానార్హం. ఇక కేరళలో స్త్రీ, పురుష అక్షరాస్యతలో పెద్ద తేడా ఏమీ లేకపోవడం గమనార్హం.

ఏపీలో స్త్రీ పురుష అక్షరాస్యతలో తేడా

ఏపీలో స్త్రీ పురుష అక్షరాస్యతలో తేడా

ఈ డేటా 2017-18కు సంబంధించినది. 7ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారిని పరిగణలోకి తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలో 96.2 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది. స్త్రీ, పురుష అక్షరాస్యతలో కేవలం 2.2శాతం తేడా ఉంంది. పురుష అక్షరాస్యత 84.7శాతం ఉండగా, స్త్రీ అక్షరాస్యత 70.3శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ, పురుష అక్షరాస్యత రేటులో 13.9 శాతం తేడా ఉంది. ఇక రాజస్థాన్ 23.2 శాతం, బీహార్ 19.2 శాతం, యూపీ 18.4 శాతం వ్యత్యాసం ఉంది.

Recommended Video

Andhra Pradesh Retains Top Rank For Ease Of Doing Business || Oneindia Telugu
గ్రామీణ, పట్టణ అక్షరాస్యతలో వ్యత్యాసం..

గ్రామీణ, పట్టణ అక్షరాస్యతలో వ్యత్యాసం..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అక్షరాస్యతలో కూడా కేరళలలో అంత పెద్ద వ్యత్యాసం లేదు. 1.9 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత కంటే పట్టణ అక్షరాస్యత 23.4శాతం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంోల ఇది 19.2 శాతంగా ఉంది. జాతీయస్థాయిలో పట్టణ పురుష అక్షరాస్యత, గ్రామీణ స్త్రీల అక్షరాస్యతతో పోల్చుకుంటే 27.2 శాతం వ్యత్యాసం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇది 38.5 శాతం ఉండగా, తెలంగాణలో 38శాతం(91.7శాతం వర్సెస్ 53.7శాతం) ఉంది.

English summary
In contrast, rural female literacy is above 80% only in Kerala and below 70% in 13 of the 22 major states. In four of these, it is below 60%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X