రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. సతీసమేతంగా హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం
ఏపీలోని విజయవాడలో గల రాజ్ భవన్ ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు వేడుకకు హాజరయ్యారు.
రాజకీయ నేతల హాజరు..
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజినోవాతో పాటు వచ్చారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, పలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గవర్నర్ ఆత్మీయ స్వాగతం..
గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా అతిథుల వద్దకు వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి, వేడుకల ఉద్దేశ్యాన్ని పంచుకున్నారు. గవర్నర్ ఆతిథ్యాన్ని అందుకున్న అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, సైనికాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొని దేశ స్వాతంత్ర్య ఘట్టాలను స్మరించుకున్నారు.
ఈ క్రమంలోనే రాజ్‌భవన్ ప్రాంగణం పూల అలంకరణలు, జాతీయ పతాక రంగుల లైటింగ్‌తో అందంగా ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సాహం, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి.












Click it and Unblock the Notifications