వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ కామెంట్స్‌తో నిర్ణ‌యం మారిపోయింది. చంద్ర‌బాబే ప్ర‌తిప‌క్ష నేత‌: ఆ వ్యాఖ్య‌లు మేలు చేస్తాయా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భలో కొత్త ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌రు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఉండ‌రా..ఉండలేరా. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రికి శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా మ‌రొక‌రికి అవ‌కాశం ఇవ్వ‌నున్నారా. టీడీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న చ‌ర్చ ఇప్పుడు ఇదే. ఈ నెల 29న జ‌రిగే టీడీఎల్పీ స‌మావేశంలో దీని పైన అధికారికంగా నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే, జ‌గ‌న్ తాజా వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబు త‌న నిర్ణ‌యం మార్చుకుంటారా.. చంద్ర‌బాబు నిజంగా ప్ర‌తిప‌క్ష నేత ప‌దివికి దూరంగా ఉండ‌గ‌ల‌రా...

ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబే..
ఏపీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయి విప‌క్ష హోదాకే టీడీపీ ప‌రిమితం అయింది. అయితే, 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా.. వైయ‌స్‌..రోశ‌య్య‌..కిర‌ణ్ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా చేసిన చంద్ర‌బాబు..ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు తిరిగి ప్రతిప‌క్ష నేతగా చూడ‌లేమ‌ని టీడీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. వైయ‌స్సార్‌తో స‌రి స‌మానులైన చంద్ర‌బాబు ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌టం స‌రికాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు గ‌తంలో కూడా ఏపీ పైనే త‌న దృష్టి ఉంటుంద‌ని..నాడు వైయ‌స్ పైన పోరాటం చేసా..ఇప్పుడు జ‌గ‌న్ పైన పోరాటం చేసాన‌ని చెబుతున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే తిరిగి చంద్ర‌బాబు ప్రతిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అంశం స్ప‌ష్ట‌వుతోంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌రువాత తాను కీల‌క బాధ్య‌త‌ల్లో లేక‌పోతే..కేడ‌ర్ మ‌రింత‌గా డీలా ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని.. తాను ముందుండి న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

At Last Chandra babu decided to take role as Opposition leaders in AP Assembly..

29న అధికారిక నిర్ణ‌యం..
చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌కూడ‌ద‌నుకుంటే ఏపీ నూతన ప్ర‌తిప‌క్ష నేత‌గా కేశవ్ వైపు ఒక స‌మ‌యంలో మొగ్గు చూపిన‌ట్లుగా స‌మాచారం. అయితే, తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధానితో స‌మావేశం త‌రువాత మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లు చెబుతున్నారు. రాజ‌ధాని భూముల మీద విచార‌ణ‌..పోల‌వ‌రం కేంద్రమే పూర్తి చేసి ఇవ్వాల‌నే జ‌గ‌న్ తాజా వ్యాఖ్య‌లు త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌చ్చ‌ని టీడీపీ భావిస్తోంది. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా..రాజ‌ధానితో పాటుగా ప్ర‌భావం చూపుతాయ‌ని.. ఇవి జ‌గ‌న్ అనుకున్న‌ట్లుగా ఆయ‌న‌కు మేలు చేయ‌వ‌ని టీడీపీ అంతర్గ‌త చ‌ర్చ‌ల్లో అభిప్రాయంగా ఉంది. దీంతో..తొలి నుండే తాము జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎక్క‌డిక్క‌డ కార్న‌ర్ చేయాలంటే చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌భ‌లోనే ఉండాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ నెల 29న జ‌రిగిఏ టీడీపీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశంలో తుది నిర్ణ‌యం జ‌ర‌గ‌నుంది.

English summary
Chandra babu decided to take charge as Opposition leader in AP assembly. Since AP results announced some leaders expecting Chandra Babu will not take LOP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X