• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీతి ఆయోగ్ సమావేశంలో...కేంద్రాన్ని, మోడీని కడిగేసిన చంద్రబాబు

By Suvarnaraju
|

న్యూ ఢిల్లీ:నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ కీలకమైన మీటింగ్ లో కేంద్రంపై, మోడీపై అసమ్మతి గళం వినిపించడం ద్వారా సిఎం చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు.

కేవలం వాదన వినిపించడమే కాదు ఒక రకంగా ఈ సమావేశంలో తోటి ముఖ్యమంత్రుల ఎదుట ప్రధాని మోడీని చంద్రబాబు కడిగేసారని చెప్పుకోవచ్చు. అంతేకాదు సమయాభావం పేరుతో తన ప్రసంగానికి అడ్డు తగలాలని చూసిన హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను అభ్యర్థనలను సైతం ధిక్కరించి రాష్ట్రానికి అన్యాయంపై చంద్రబాబు తన వాదన ఆసాంతం వినిపించారు.

నీతి ఆయోగ్...మోడీ ప్రారంభోన్యాసం

నీతి ఆయోగ్...మోడీ ప్రారంభోన్యాసం

ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం జరుగగా, 2022 నాటికి దేశాభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై విమర్శల వర్షం కురిపించారు. మోదీ ప్రసంగం తరువాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకే తొలుత మాట్లాడే అవకాశం లభించింది. తమ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

కేంద్రం...సహకరించడం లేదు...

కేంద్రం...సహకరించడం లేదు...

కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏపీలో సేవారంగం విస్తరిస్తోందని, సేవారంగం వృద్ధిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని మరోసారి గుర్తు చేసిన ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడం లేదని, అసలు హామీలు నెరవేర్చే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకుంటే, ప్రజలు కేంద్రంపై విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు.

పోలవరం...రెవిన్యూ లోటు

పోలవరం...రెవిన్యూ లోటు

పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని చంద్రబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పోలవరం బాధితుల పునరావాసానికి కావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఆగిపోయాయని, తాము లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని ఆరోపించడం ఎంతవరకూ సబబని చంద్రబాబు నిలదీశారు. రెవెన్యూ లోటు విషయంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించారని నిప్పులు చెరిగిన చంద్రబాబు...గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాల్సిందేనని అన్నారు.

పలు సమస్యలు...ప్రస్తావన

పలు సమస్యలు...ప్రస్తావన

వ్యవసాయంకు సంబంధించి కనీస మద్దతు ధర, నరేగా పనులు, రైతుల ఆదాయం రెట్టింపు, పంటలకు భీమా వంటి అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. అలాగే జాతీయ వృద్ధిరేటు 2.4 శాతం గా ఉంటే, రాష్ట్ర వృద్ధి రేటు 11 శాతం ఉందని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం మరియు గృహనిర్మాణ రంగంకు సంబంధించి ఎస్ఈసిసి నివేదికలో అసమానతలు ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా నాటి ప్రధానికి సమస్యలు విన్నవించుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 15 ఆర్ధిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు పేర్కొన్న ముఖ్యమంత్రి...డీమానిటైజేషన్ , జీఎస్టీ వంటి అంశాలను ప్రస్తావించారు. టీమ్ ఇండియా నిర్మాణం అంటే నిజమైన సహకార ఫెడరిలిజం స్పూర్తితో ముందుకు సాగడమేనని పేర్కింటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi:Interesting scene took place at the Niti Aayog convention. In this key meeting, CM Chandrababu has expressed his dissatisfaction over central government and Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more