• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అచ్చెన్నాయుడు రివర్స్ కౌంటర్ .. నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నా జగన్

|

ఏపీ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు సీఎం జగన్ . చాలా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు . మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర, బుద్ధి పెరగలేదు అంటూ సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ప్రసంగించే సమయంలో అడ్డు తగలడంతో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు .

ఏపీ రైల్వే కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ .. ప్రజలు ఆవును కోరితే ఎద్దును ఇస్తారా అని ఫైర్

 జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు అంతే గట్టిగా సమాధానం చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు అంతే గట్టిగా సమాధానం చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సభను తప్పుదారి పట్టించారని, నిన్న శాసనసభలో అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు అంతే గట్టిగా సమాధానం ఇచ్చారు. జగన్ కు అవగాహన లేదు. సీనియారిటీ లేదు అందుకే అలా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

  ఇది సభ చేపల మార్కెట్ కాదు
  ఇష్యూని దారి మళ్ళించటానికి తమపై ఘాటు వ్యాఖ్యలు చేశారంటున్న అచ్చెన్నాయుడు

  ఇష్యూని దారి మళ్ళించటానికి తమపై ఘాటు వ్యాఖ్యలు చేశారంటున్న అచ్చెన్నాయుడు

  చాలామంది కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నట్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నామని కనీసం సీఎం గారు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోటానికి కన్సల్టెంట్ ను పెట్టుకోవాలని సూచించారు. శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకోవాలి అని వ్యాఖ్యానించారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చను మధ్యలో అర్ధంతరంగా ముగించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఇక శాసన సభలో ఏం జరుగుతుందో సీఎం జగన్ కు అవగాహన లేదని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. నిన్న శాసనసభలో జరిగిన విషయమై చర్చ జరపాలంటే, సీఎం, ఇతర మంత్రులు దానిపై మాట్లాడకుండా ఆవు కథ చెబుతున్నారని విమర్శించారు.

   మీకు కూడా అది పెరగాలని , హుందాతనం రావాలని కోరుకుంటున్నా అని రివర్స్ కౌంటర్ ఇచ్చిన అచ్చెన్న

  మీకు కూడా అది పెరగాలని , హుందాతనం రావాలని కోరుకుంటున్నా అని రివర్స్ కౌంటర్ ఇచ్చిన అచ్చెన్న

  మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్, టీడీపీకి ఓ ఛాలెంజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ‘టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.కానీ ఎప్పుడు ఎంత మంజూరు చేశామో లెక్కలు చూపించామని ఆయన పేర్కొన్నారు.. కానీ చివరికి సీఎం నోరు జారి ఇష్టం వచ్చిన రీతిలో సభలో మాట్లాడిన విషయంలో క్షమాపణలు చెప్పకుండా, ఇష్యూను దారిమళ్లించేందుకు చంద్రబాబును ,తనను అవమానించేలా మాట్లాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . నా బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని ఆయన విమర్శించారన్న అచ్చెన్న జగన్.. మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నా. మీకు కూడా హుందాతనం రావాలని కోరుకుంటున్నా అంటూ అచ్చెన్నాయుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM YS Jagan has slipped his tongue and made body-shaming comments on Tekkali TDP MLA Atcchannaidu. While speaking about the measures, the government will take for farmers in this monsoon season, Jagan lost his cool when he was interrupted by Atcchannaidu."Aa Manishi Aa Sizelo Unnadu Kani Burra Matram Peragaledu," said Jagan directly hitting at the TDP leader. He has criticized my body has grown but my mind has not grown. You have become the chief minister. first You want it to grow, and also you have to learn the decency too. a reverse counter to the comments made by Achennayudu to CM Jagan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more