గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్, అనారోగ్యం దృష్ట్యా జీజీహెచ్‌లో ట్రీట్‌మెంట్

|
Google Oneindia TeluguNews

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆధరాలు తమ వద్ద ఉన్నాయని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. చివరికి రాత్రి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యాలో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని పోలీసులను మేజిస్ట్రేట్ ఆదేశించారు.

'అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’'అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’

ఫైల్స్ సర్జరీ..

ఫైల్స్ సర్జరీ..

అచ్చెన్నాయుడుకు గురువారం శ్రీకాకుళంలోని కిమ్స్‌లో శస్త్రచికిత్స జరిగిందని ఆయన తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఫైల్స్ సర్జరీ అయ్యిందని.. కానీ ఆస్పత్రిలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గురువారమే ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో ఆయన స్వగ్రామం నిమ్మాడ వెళ్లారని.. ఆ మరునాడే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో స్పందించిన.. న్యాయమూర్తి, అచ్చెన్నాయుడుకు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అచ్చెన్నాయుడుకు అందించే వైద్యం గురించి తమకు నివేదిక అందజేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

అక్రమాలు

అక్రమాలు

గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే స్కాం జరిగిందని.. ఈ మేరకు ఏసీబీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సంబంధించి మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించారని.. ఈఎస్ఐ నిధులతో మందులు, వైద్య, ల్యాబ్‌ పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలతో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.

Recommended Video

అవినీతి చేసిన ఎవ్వరినీ వదలము.. RK ROJA వార్నింగ్
 136 శాతం ఎక్కువ ధర

136 శాతం ఎక్కువ ధర

నకిలీ కొటేషన్లతో అసలు ధరల కంటే, 136 శాతం అదనంగా ధరలు కోట్‌చేసి నిధులు పక్కదారి పట్టించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మందుల కొనుగోళ్లలో అవినీతికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శుక్రవారం ఉదయం అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చేరుకున్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించి.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు.

English summary
acb court remanded by ex minister kinjarapu atchannaidu on esi scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X